Srikalahasti: శ్రీకాళహస్తి పట్టణంలో.. దొంగ ఓట్లు వేస్తున్నారంటూ టీడీపీ నేతల నిరసన

Srikalahasti: టీడీపీ నేతలపైకి దూసుకెళ్లిన వైసీపీ శ్రేణులు

Dhatripriya
Updated on: 13 March 2023 7:53 PM IST
Srikalahasti MLC Polling Center Was Surrounded By TDP Leaders
X

Srikalahasti: శ్రీకాళహస్తి పట్టణంలో.. దొంగ ఓట్లు వేస్తున్నారంటూ టీడీపీ నేతల నిరసన

Srikalahasti: తిరుపతి శ్రీకాళహస్తి పట్టణంలోని జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల పోలింగ్‌ కేంద్రం వద్ద హై టెన్షన్‌ నెలకొంది. దొంగ ఓట్లు వేస్తున్నారంటూ టీడీపీ నేతలు పోలింగ్‌ కేంద్రంలోకి దూసుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ నేతలు నిరసన తెలిపారు. నిరసనకారులపైకి వైసీపీ శ్రేణులు దూసుకురావడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు వర్గాల మధ్య తోపులాటలో టీడీపీ నేత కృష్ణ యాదవ్‌ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

Dhatripriya

Dhatripriya

Next Story