ఎక్స్‌ప్రెస్ రైలుకు తప్పిన ప్రమాదం

ఎక్స్‌ప్రెస్ రైలుకు తప్పిన ప్రమాదం
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

దిగా నుండి విశాఖపట్నం వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు భారీ ప్రమాదం నుంచి తప్పించుకుంది. శ్రీకాకుళం జిల్లాలోని తిలారు రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు...

దిగా నుండి విశాఖపట్నం వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు భారీ ప్రమాదం నుంచి తప్పించుకుంది. శ్రీకాకుళం జిల్లాలోని తిలారు రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పడాన్ని గమనించిన లోకో పైలట్.. వెంటనే అప్రమత్తమై అకస్మాత్తుగా రైలును నిలిపివేశాడు.. అప్పటికే ఇంజిన్‌తో సహా మూడు బోగీలు విరిగిన రైలు పట్టాలలోకి ప్రవేశించాయి. అయితే, రైలు సురక్షితంగా ఆగింది.. దాంతో ప్రయాణికులందరు ఊపిరి పీల్చుకున్నారు.

అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులందరు సురక్షితంగా ఉన్నారు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతులు చేశారు. దీంతో సుమారు 40 నిమిషాల పాటు రైలు నిలిచిపోయింది. ముందుగా తాత్కాలిక ఏర్పాట్లు చేసిన తరువాత రైలు అక్కడినుంచి వెళ్ళింది.. అనంతరం ట్రాక్ ను పూర్తి స్థాయిలో మరమ్మతులు చేశారు రైల్వే అధికారులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories