Srikakulam District Collector J.Nivas: కరోనాపై అప్రమత్తంగా ఉండండి

Srikakulam District Collector J.Nivas: కరోనా వైరస్ రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అన్నారు.
Srikakulam District Collector J.Nivas: కరోనా వైరస్ రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అన్నారు. శుక్రవారం మెలియాపుట్టి లో శ్రీ కమలా కళ్యాణ మండపంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కంటోన్మెంట్ ప్రాంతాలలో అధికారులంతా అప్రమత్తంగా ఉండి ప్రజలు ఇంటి నుండి బయటకు రాకుండా చూడాలని, వారికి కావాల్సిన సౌకర్యాలు సమకూర్చాలి అని అన్నారు. 60 సంవత్సరాలు దాటిన వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అవసరమనుకుంటే వారికి పాతపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని అన్నారు.
కోవిడ్ పరీక్షలు చేయించుకున్న వారు పదిహేను రోజులపాటు ఇంటికే పరిమితం కావాలని, బయటికి వచ్చినట్లయితే వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. కోవిడ్ పరీక్షలు చేయించుకున్న వారి ఇళ్లకు ప్రతిరోజు ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, వెళ్లి వారి యొక్క ఆరోగ్య పరిస్థితులను నమోదు చేయాలని అన్నారు. అనంతరం చాపర కంటోన్మెంట్ ప్రాంతాన్ని పరిశీలించి అధికారులకు పలు సలహాలు, సూచనలు అందించారు. ఆయనతో పాటు ఆర్డీఓ టి.వి.ఎస్ జి.కుమార్ మండల స్పెషల్ ఆఫీసర్ టి.భవాని శంకర్ ఎంపీడీవో పి.చంద్ర కుమారి డిప్యూటీ తహసీల్దారు బి.ప్రసాదరావు, ఈఓపిఆర్డీ రమేష్, వైద్యాధికారులు జి.గణపతిరావు, ప్రసాద్ రెడ్డి, శివ కుమార్ పలువురు అధికారులు పాల్గొన్నారు.
నిడదవోలు వైసీపీ ప్లీనరీ సమావేశంలో నోరుజారిన తానేటి వనిత
28 Jun 2022 7:36 AM GMTబొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు
27 Jun 2022 4:00 PM GMTబాలినేని హాట్ కామెంట్స్.. నాపై కుట్రలు జరుగుతున్నాయి.. సొంత పార్టీ నేతలే..
27 Jun 2022 1:39 PM GMTటీ హబ్-2 ప్రారంభానికి సిద్ధం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్
27 Jun 2022 1:31 PM GMTరైతుబంధు పంపిణీ రేపటి నుంచే.. మొదటిసారి అర్హులైన వారికి అలెర్ట్.. అలా చేస్తేనే..
27 Jun 2022 1:15 PM GMTజూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు
27 Jun 2022 1:00 PM GMTవ్యవసాయ బావిలో పడిన ఏనుగు.. ఐదు గంటల పాటు శ్రమించిన అటవీ అధికారులు
27 Jun 2022 12:15 PM GMT
ఆదిలాబాద్ జిల్లాలో విద్యార్ధులకు పాఠ్య పుస్తకాల కష్టాలు
29 Jun 2022 3:12 AM GMTమన్యాన్ని వణికిస్తున్న సీజనల్ వ్యాధులు
29 Jun 2022 2:46 AM GMTవ్యవసాయ సీజన్ మొదలైనా నైరాశ్యంలో రైతన్న
29 Jun 2022 2:08 AM GMTONGC Helicopter Crash: ఓఎన్జీసీకి చెందిన హెలికాప్టర్‌కు ప్రమాదం
29 Jun 2022 1:29 AM GMTMeena Husband Death: నటి మీనా భర్త విద్యాసాగర్ హఠాన్మరణం
29 Jun 2022 1:16 AM GMT