Srisailam Temple: శ్రీశైలంలో నేటి నుంచి శ్రావణ మాసోత్సవాలు

Srisailam Temple: శ్రావణ మాసోత్సవాలపై ఈవో సమీక్ష

Sriveni Erugu
Published on: 29 July 2022 8:34 AM IST
Sravana Masam Celebrations From Today At Srisailam Temple
X

Srisailam Temple: శ్రీశైలంలో నేటి నుంచి శ్రావణ మాసోత్సవాలు

Srisailam Temple: శ్రీశైలం మహాక్షేత్రంలో నేటి నుండి ఆగస్టు 28 వరకు శ్రావణ మాసోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. మాసోత్సవాలపై ఆలయ ఈవో లవన్న దేవస్థానం అధికారులు, అర్చకులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా స్వామి అమ్మవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు. శ్రావణమాసం శని, ఆది, సోమ, పౌర్ణమి రోజుల్లో భక్తులు స్వామివారికి నిర్వహించుకునే గర్భాలయ అభిషేకాలు పూర్తిగా నిలుపుదల చేస్తామన్నారు.

శ్రావణ మాసోత్సవం నేపథ్యంలో గర్బాలయ అభిషేకాలు, అంతరాలయంలో కుంకుమార్చనలు నిలుపుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. శ్రావణ రెండు, నాలుగవ శుక్రవారాలలో ముత్తైదువులకు ఉచితంగా సామూహిక వరలక్ష్మీవ్రతాలు, నాలుగవ శుక్రవారం 500 మంది చెంచు గిరిజన మహిళలకు ఉచితంగా వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తామని ఆలయ ఈవో లవన్న తెలిపారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story