సంచయిత నియామకంలో ఓ స్వామిజీ పాత్రపై ఊహాగానాలు.. ఎవరా స్వామిజీ?

సంచయిత నియామకంలో ఓ స్వామిజీ పాత్రపై ఊహాగానాలు.. ఎవరా స్వామిజీ?
x
అశోక గజపతి రాజు-సంచయిత
Highlights

అశోక గజపతి రాజు-సంచయిత. అప్పన్న ఆలయ సారథ్యంపై ఇప్పుడు ఈ బాబాయి-అమ్మాయి మధ్య చిన్నపాటి యుద్ధమే జరుగుతోంది. అనువంశిక ధర్మానికి తూట్లు పొడిచారని అశోక్‌...

అశోక గజపతి రాజు-సంచయిత. అప్పన్న ఆలయ సారథ్యంపై ఇప్పుడు ఈ బాబాయి-అమ్మాయి మధ్య చిన్నపాటి యుద్ధమే జరుగుతోంది. అనువంశిక ధర్మానికి తూట్లు పొడిచారని అశోక్‌ అంటుంటే, మహిళను అయినందుకే చిన్నచూపు చూస్తారా అంటూ ఎదురుప్రశ్నిస్తున్నారు సంచయిత. అయితే, ఈ మొత్తం ఎపిసోడ్‌లో మరో ఇంట్రెస్టింగ్‌ యాంగిల్‌ తెరపైకి వచ్చింది. సంచయిత నియామకంలో ఓ స్వామిజీ కీలక పాత్ర పోషించారట....ఉత్తరాంధ్రలో అత్యంత పవర్‌ఫుల్‌ స్వామిజీ చక్రంతిప్పారట. ఇంతకీ ఎవరా స్వామిజీ? ట్రస్ట్‌పై ఎందుకంత ఇంట్రెస్ట్?

సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు, మాన్సాస్ చైర్‌ పర్సన్‌గా సంచయిత నియామకం, ఎంత సంచలనం సృష్టించిందో, ఎలాంటి రాజకీయ ప్రకంపనలు రేపుతోందో చూస్తున్నాం. ట్రస్ట్‌ సంప్రదాయం, ఒప్పందానికి భిన్నంగా ప్రభుత్వం సడెన్‌గా సంచయితను నియమించిందంటూ, అశోక్‌ గజపతి రాజుతో పాటు టీడీపీ నేతలు సైతం తీవ్రంగా ఫైర్‌ అయ్యారు. అయితే, ట్రస్టుల చైర్‌ పర్సన్‌గా సంచయిత పేరు తెరపైకి తేవడంలో, కొందరు స్వామిజీలు కీలక పాత్ర పోషించారంటూ వినిపిస్తున్న చర్చ ఆసక్తి కలిగిస్తోంది.

దేవస్థానం ట్రస్ట్ బోర్డు, అలాగే మాన్సాస్‌ ట్రస్టుల సారథులుగా అనువంశిక ధర్మకర్తగా ఉన్న పూసపాటి వంశీయులే కొనసాగడం సంప్రదాయంగా వస్తోంది. గతంలో పూసపాటి ఆనంద గజపతి రాజు ట్రస్ట్‌ చైర్మన్‌గా ఉండేవారు. ఆయన మరణం తర్వాత అనువంశిక ధర్మకర్తగా బాధ్యతలు చేపట్టిన మాజీ కేంద్రమంత్రి, టీడీపీ నేత పూసపాటి అశోక్ గజపతి రాజు, ట్రస్ట్ బోర్డు చైర్మన్ అయ్యారు. అయితే ఇటీవల వైసీపీ ప్రభుత్వం ఆకస్మికంగా సింహాచలం ట్రస్టు బోర్డును నియమించింది. అయితే అనూహ్యంగా స్వర్గీయ ఆనంద గజపతిరాజు కుమార్తె, సంచియిత ట్రస్ట్ బోర్డు చైర్‌ పర్సన్‌గా ప్రమాణ స్వీకారం చేయడం రాజకీయ దుమారం రేపింది. అయితే, దీని వెనక ఉత్తరాంధ్రలో ఒక కీలకమైన స్వామిజీ, అందులోనూ అధికార పార్టీతో సత్సంబంధాలున్న స్వామిజీ చక్రంతిప్పారన్న చర్చ, అందరి నోటా వినిపిస్తోంది. ఇంతకీ ట్రస్టుపై స్వామిజీలకు ఎందుకంత ఇంట్రెస్ట్?

విశాఖ, విజయనగరంలో అప్పన్న ట్రస్టు అధీనంలో వేలాది ఎకరాలున్నాయి. ఈ స్థలాల్లో ప్రజలకు సేవ చేసే కార్యక్రమాలు చేయాలన్నా, ఆలయాలు కట్టాలన్నా, ఆశ్రమాలు నిర్వహించాలన్నా, ట్రస్టు చైర్మన్‌ అనుమతి కావాల్సిందే. అది ట్రస్టు రూల్. అయితే, ఉత్తరాంధ్రలో వున్న కొందరు స్వామిజీలు మాత్రం గతంలో చాలాసార్లు ఆశ్రమాలు కట్టేందుకు స్థలం అడిగారట. నేరుగా వెళ్లి రాతపూర్వకంగా అడకపోయినా, మధ్యవర్తుల ద్వారా రాయబారం నడిపారట. కానీ చైర్మన్‌గా వున్న అశోక గజపతి రాజు, టీడీపీ నాయకుడు. ఒక స్వామిజీ మాత్రం నాడు ప్రతిపక్షంలో వున్న పార్టీకి సన్నిహితుడు. దీంతో స్వామిజీ ఆశ్రమాల అభ్యర్థనను తిరస్కరించారట అశోక గజపతి రాజు. ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఒప్పుకోలేదట. అశోకే చైర్మన్‌గా వుంటే, ఆశ్రమాల స్థాపనకు స్థలమివ్వరని భావించిన స్వామిజీలు, సంచయితను తెరపైకి తెచ్చారట. పూసపాటి కుటుంబాల్లో ఆల్రెడీ గొడవలున్న నేపథ్యాన్ని ఆసరాగా చేసుకుని చక్రంతిప్పారన్న చర్చ జరుగుతోంది.

స్వామిజీలే కాదు, కొందరు బీజేపీ నేతలు సైతం సంచయిత నియామకం కోసం ప్రభుత్వంతో చర్చలు జరిపారన్న మాటలు వినపడ్తున్నాయి. బీజేపీలో యాక్టివ్‌గా వున్న సంచయితను, చైర్మన్‌ చేయడం ద్వారా అశోక్‌ గజపతికి చెక్‌పడుతుందని, ఉత్తరాంధ్రలో బలపడేందుకు అవకాశముంటుందని బీజేపీ ఆలోచించిందట. అయితే, స్థానిక బీజేపీ నేతలు మాత్రం, సంచయిత నియామకాన్ని వ్యతిరేకించినా, అధిష్టానపెద్దలు మాత్రం, వ్యూహాత్మకంగానే సంచయిత పేరును సమర్థించారట. మొత్తానికి సంచయిత నియామకంపై ఇప్పటికే రచ్చ జరుగుతోంది. కోర్టుల్లో తేల్చుకుంటామని అశోక్ వర్గమంటోంది. తాను సైతం పోరాడతానంటూ సంచయిత చెబుతున్నారు. ఈ నేపథ్యంలో స్వామిజీలు సైతం సంచయితకు బలంగా మద్దతుగా వున్నారన్న మాటలు ఆసక్తి కలిగిస్తున్నాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories