ఓ ఎమ్మెల్యే.. తాటి ముంజెలు.. ప్రజాదరణ !

ఓ ఎమ్మెల్యే.. తాటి ముంజెలు.. ప్రజాదరణ !
x
Highlights

ఆయనో ఎమ్మెల్యే కానీ ఆయన రూటే సపరేట్‌ నలుగురు నడిచిన దారిఆయనకు అస్సలు నచ్చదు. ఏ విషయంలోనైనా కొత్తగా ట్రెండీగా ఉండాలని ట్రై చేస్తారు. సరదా కోసం...

ఆయనో ఎమ్మెల్యే కానీ ఆయన రూటే సపరేట్‌ నలుగురు నడిచిన దారిఆయనకు అస్సలు నచ్చదు. ఏ విషయంలోనైనా కొత్తగా ట్రెండీగా ఉండాలని ట్రై చేస్తారు. సరదా కోసం నడిసంద్రంలోకి దిగి ఈజీగా ఈత కొట్టగలరు. మూడోస్తే ముంజలు కోయగలరు. ఆయన స్టైల్‌ చూసి ఆ ఎమ్మెల్యే మామూలోడు కాదు. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరో ఆయన స్టైల్‌ ఏంటో తెలియాలంటే స్టోరీలోకి ఎంటర్‌ కావాల్సిందే.

నులక మంచంపై తాపీగా తాడిముంజలను కోస్తున్న ఈ ఎమ్మెల్యే ఎవరో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. మీరు అనుకున్నంది కరెక్ట్‌ కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డి. రాజకీయ వ్యూహాల్లో హేమాహేమీలతో తలపడ్డ ఆయనకు మరో యాంగిల్‌ కూడా. రాజీకీయాల్లో ఎప్పుడు సీరియస్‌గా ఉండే ఆయన ఆప్తులు, సన్నిహితులతో జాలీగా గడుపుతుంటారు.

సాధారణ రైతు కుటుంబం నుంచి ఆయనకు కష్టనష్టాల గురించి బాగా తెలుసు. అందుకే ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకున్నా స్వయం కృషితో ఉన్నతస్థాయికి చేరడంతో పాటు విద్యాసంస్ధల అధిపతిగా ఎదిగారు. ఇంతస్థాయికి ఎదిగిన తాను వచ్చిన మార్గాన్ని పాత జ్ఞాపకాలను ఏమాత్రం మర్చిపోలేదు. ఓ వైపు ఎమ్మెల్యేగా బిజీబిజీగా ఉన్నా బాల్యస్మృతులను గుర్తు చేసుకుంటారు. తన హోదాను, రాజసాలు కాసేపు పక్కన పెట్టి సామాన్యుడిలా మారిపోతారు. నడి సముద్రంలో దిగి ఈత కొట్టినా తాటిముంజాలు కట్‌ చేసినా ఆయనకే చెల్లుతోంది.

ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా ఓ పల్లెటూరికి వెళ్లిన ఎమ్మెల్యే తాటిచెట్టుకి తాటికాయలు కనిపించాయి. వెంటనే తాటికాయలను కోసి వాటిని ఓ ప్రొఫెషనల్ గా కట్‌ చేయడం ఆశ్చర్యానికి గురి చేసింది. తాడికాయలు కోసి తన మిత్రులకు ప్రేమగా అందించిన ఎమ్మెల్యేని చూసి స్థానికులు మనసున్న మహరాజని కితాబిస్తున్నారు. అధికారం చేతిలో ఉన్నా ఏ మాత్రం ప్రదర్శించకుండా సింపుల్‌గా ఉంటూ ప్రజలకు చేరవతున్న ఎమ్మెల్యే నేటి తరం యువలీడర్లకు రోల్‌మోడల్‌ అనే చెప్పాలి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories