వీధికుక్కలను ప్రాణంగా చూసుకుంటున్న కుటుంబం

వీధికుక్కలను ప్రాణంగా చూసుకుంటున్న కుటుంబం
x
Highlights

తొమ్మిది నెలలుగా అంధకారం ఉండటానికి ఇల్లు లేదు తినడానికి తిండి లేదు. ఐనా మూగజీవాలపై మమకారం తగ్గలేదు. 33 వీధి కుక్కలపై అనురాగాన్ని పెంచుకున్నారు. కంటికి...

తొమ్మిది నెలలుగా అంధకారం ఉండటానికి ఇల్లు లేదు తినడానికి తిండి లేదు. ఐనా మూగజీవాలపై మమకారం తగ్గలేదు. 33 వీధి కుక్కలపై అనురాగాన్ని పెంచుకున్నారు. కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అప్యాయతను పంచడంలో ఎక్కడా తగ్గలేదు. వీధికుక్కలను ప్రాణంగా చూసుకుంటున్న ఆ కుటుంబంపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ.

సత్యనారాయణ అనే వ్యక్తి విశాఖ పోర్టులో ఉద్యోగం చేసి రిటైరయ్యారు. సత్యనారాయణకు కుక్కులు అంటే చాలా ఇష్టం. అందరు ముద్దుగా ఉండే కుక్కలను పెంచుకుంటారు. కానీ సత్యనారాయణ మాత్రం వీధి కుక్కలపై ప్రేమ కురుపించేవాడు. ఏకంగా 83 వీధి కుక్కులను అక్కున చేర్చుకున్నాడు. వృద్ధాప్యం, అనారోగ్య కారణాల వల్ల 50 కుక్కలు చనిపోయాయి. ప్రస్తుతం 33కుక్కలను ఆ కుటుంబం పోషిస్తుంది.

అయితే తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి చేరడంతో వాటి బాధ్యతను పిల్లులు తీసుకున్నారు. అందులో భార్గవి వాటిని పిల్లల్లగా చూసుకుంటోంది. వాటి పోషణ కోసం అక్క పద్మావతి ఉద్యోగం చేస్తోంది. మరో అక్క విజయలక్ష్మి వాటికి వంట చేసిపెడుతోంది. ఇంట్లో వాటికి మంచాలు, టేబుళ్లు, కుర్చీలు, దివాన్‌ కూడా ఏర్పాటు చేశారు.

వీటి పోషణ కోసం ఆ కుటుంబం ప్రతి నెల సుమారు 25వేల వరకు ఖర్చుపెడుతోంది. వ్యాక్సిన్, ఆపరేషన్స్, మందుల కోసం బంగారం, చెవి దిద్దులు సైతం అమ్ముకున్నారు. ఇదిలా ఉండగా క్వార్టర్లు శిథిలావస్థకు చేరడంతో క్వార్టర్లలో నివాసముంటున్న వారిని ఖాళీ చేయించారు పోర్టు అధికారులు.

భార్గవి కుటుంబం ఖాళీ చేయకపోవడంతో అధికారులు విద్యుత్, నల్లా కనెక్షన్లు తొలగించారు. వేరే ఇంటికి వెళ్దామంటే ఈ 33 కుక్కలకు సరిపడా ఇల్లును ఎవరు అద్దెకు ఇవ్వడం లేదు. ఈ నెల 30లోగా క్వార్టర్స్ ఖాళీ చేయాలని పోర్టు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆలోపు దాతలు, పెట్‌ లవర్స్ సాయం చేయాలని కోరుకుంటున్నారు. మూగజీవిలతో కలిసి ఉండడానికి చిన్న చోటు ఇప్పించాలంటూ వేడుకుంటున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories