ఆమ్రపాలి కాటIPS : ఒంగోలు టూ పీఎంవో

ఆమ్రపాలి కాటIPS : ఒంగోలు టూ పీఎంవో
x
Highlights

కొంతమంది అధికారులు వృత్తికే వన్నె తెస్తారు ఆ కోవలోకే చెందుతుంది ఈ ఐఏఎస్ అధికారిణి. సాధారణంగా కనిపించే అసాధారణ మహిళగా గుర్తింపు...

కొంతమంది అధికారులు వృత్తికే వన్నె తెస్తారు ఆ కోవలోకే చెందుతుంది ఈ ఐఏఎస్ అధికారిణి. సాధారణంగా కనిపించే అసాధారణ మహిళగా గుర్తింపు తెచ్చుకుంది. ఉద్యోగం చేసే ప్రతి చోట అక్కడి ప్రజల నుంచి విడదీయరాని సంబంధాలను ఏర్పరుచుకుంది అందం, అభినయం, అధికారం కలబోసిన అధికారిగా ప్రజల మన్ననలు పొందింది. ఆమె మరెవరో కాదు ఐఏఎస్ అధికారి ఆమ్రపాలి కాట. ప్రస్తుతం ఆమె అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకుంది. ప్రధాన మంత్రి ఆఫీస్‌లో డిప్యూటి సెక్రటరీగా ఎంపికైంది. ఒంగోలు టూ పీఎంవో ఆఫీస్ వరకు తన ప్రయాణం ఎలా సాగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆమ్రపాలి ప్రకాశం జిల్లాలోని అగ్రహారం అనే కుగ్రామంలో కాట వెంకటరెడ్డి, పద్మావతి దంపతులకు మొదటి సంతానంగా జన్మించింది. వెంకటరెడ్డిది వ్యవసాయ కుటుంబమే అయినా ఆయన విశాఖపట్నంలో ప్రొఫెసర్‌గా పనిచేసేవారు. దీంతో ఆమ్రపాలి ఉన్నత చదువులు మొత్తం విశాఖపట్నంలోనే చదివింది. తండ్రి వెంకటరెడ్డి మాత్రం తన ఇద్దరు పిల్లలు రానున్న రోజుల్లో గొప్పవారు అవుతారని ముందుగానే ఊహించారు. అందుకే పెద్ద కుమార్తెకు ఆమ్రపాలి అని చిన్న కుమార్తెకు మానస గంగోత్రి అని నదుల పేర్లను పెట్టారు.

ఆమ్రపాలి 2010 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారిగా విధుల్లో చేరారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలో కలక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం పీఎంవో డిప్యూటీ సెక్రటరీగా ఎంపికయ్యారు. అతి చిన్న వయసులో ఈ పోస్టులో ఎంపికైన వారిలో ఆమ్రపాలి ఒకరు. దీంతో ఒంగోలు జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మొదటగా ఆమ్రపాలి చెల్లలు మానసా గంగోత్రి 2007లో ఐఆర్‌ఎస్‌కి సెలక్ట్ అయింది. దీంతో చెల్లెలు సాధించిన విజయాన్ని తను కూడా సాధించాలనే తపనతో పట్టుపట్టి చదివి విజయం సాధించింది. ఐపీఎస్ అధికారి సమీర్ శర్మను పెళ్లి చేసుకుంది. అలాగే తన చెల్లెలు, ఆమె భర్త ప్రవీణ్ కుమార్ తమిళనాడు క్యాడర్‌లో పని చేస్తున్నారు. ఇలా ఆ కుటుంబంలో అందరూ ఉన్నత స్థానంలో నిలచారు. ఆమ్రపాలి ఇలాంటి ఉన్నత స్థానాలను మరెన్నో అధిరోహించాలని ఒంగోలు జిల్లా వాసులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.Show Full Article
Print Article
Next Story
More Stories