గిన్నిస్‌ రికార్డుకు చేరువలో అమీర్‌జాన్‌ చిత్రం

గిన్నిస్‌ రికార్డుకు చేరువలో అమీర్‌జాన్‌ చిత్రం
x

గిన్నిస్‌ రికార్డుకు చేరువలో అమీర్‌జాన్‌ చిత్రం

Highlights

మొత్తం 45 రికార్డులు. అందులో రెండు లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ కాగా.. ఇండియా బుక్ ఆఫ్ రికార్డు మరొకటి. ఇప్పుడు ఆయన టార్గెట్‌ గిన్నిస్ బుక్ ఆఫ్...

మొత్తం 45 రికార్డులు. అందులో రెండు లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ కాగా.. ఇండియా బుక్ ఆఫ్ రికార్డు మరొకటి. ఇప్పుడు ఆయన టార్గెట్‌ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు. అందుకోసం రోజుకు ఎనిమిదగంటల శ్రమ, మరెవరూ చేయలేని విధంగా మేకప్‌కు సంబంధించిన వస్తువులతో పెయింటింగ్‌. మీకు చూడాలని ఉందా..? అయితే లెట్‌ వాచ్‌ దిస్‌ స్టోరీ.

ప్రముఖ చిత్రకారుడు షేక్‌ అమీర్‌ జాన్‌ అరుదైన గౌరవం కోసం అహర్నిషలు శ్రమిస్తున్నారు. తన సూక్ష్మ కళారూపాలతో ఇప్పటికే దేశీయ రికార్డులు సాధించిన అమీర్‌ జాన్‌ ఈసారి గిన్నిస్‌ రికార్డుపై గురి పెట్టారు. ప్రపంచస్థాయిలోనే మరెవరూ చేయలేని విధంగా తన ప్రత్యేకతను చాటేందుకు ఆరు రోజులుగా శ్రమిస్తున్నారు. సుమారు 790 అడుగుల లార్జెస్ట్‌ మేకప్‌ పెయింటింగ్‌ చిత్రీకరిస్తున్నారు.

నెల్లూరు రెయిన్‌బో స్కూల్‌ వేదికగా" సేవ్‌ ట్రీస్‌" అనే అంశంపై అమీర్‌ జాన్‌ పెయింటింగ్‌ వేస్తున్నారు. మేకప్‌కు సంబంధించి బలైనర్స్‌, ఐషేడ్స్‌తోపాటు మేకప్‌కు ఉపయోగించే ట్రిషన్లు, స్పాంజిలను పెయింటింగ్‌కు ఉపయోగిస్తున్నాడు. ఇప్పటికే అమీర్‌ జాన్‌ 500 అడుగుల చిత్రాన్ని పూర్తి చేయగా పెయింటింగ్‌ను చూసేందుకు సుదూర ప్రాంతాల నుండి ఆర్టిస్టులు, కళాకారులు క్యూ కడుతున్నారు.

ఇప్పటికే అమీర్‌ జాన్‌ ప్రపంచవ్యాప్తంగా 45 రికార్డులు సాధించాడు. ఇప్పుడు గిన్నిస్‌ బుక్ ఆఫ్‌ రికార్డు లక్ష్యంగా మేకప్‌ పెయింటింగ్‌ చిత్రీస్తున్నాడు. ఇదిలా ఉండగా గిన్నిస్‌ బుక్‌ వారి నిబంధనల ప్రకారం గెజిటెడ్‌ అధికారులు పర్యావేక్షిస్తుండగా అధికారుల సాక్షి సంతకాలు, చిత్రీకరణ పూర్తి అయ్యేవరకు లైవ్‌ వీడియో జరుగుతోంది. చెప్పాలంటే సూక్ష్మ చిత్రాల విభాగంలో అమీర్‌జాన్‌ వరుసగా రెండు లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సాధించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories