Disha App: మహిళల రక్షణకోసమే దిశ చట్టం, యాప్ తీసుకొచ్చాం: ఏపీ హోంమంత్రి

Disha App: మహిళల రక్షణకోసమే దిశ చట్టం, యాప్ తీసుకొచ్చినట్లు ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు.

Arun Chilukuri
Published on: 25 Jun 2021 3:03 PM IST
Special Drive on Disha App Usage
X

మేకతోటి సుచరిత(ఫైల్ ఇమేజ్ )

Disha App: మహిళల రక్షణకోసమే దిశ చట్టం, యాప్ తీసుకొచ్చినట్లు ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. రాష్ట్రంలో 18 దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. మొత్తం 15లక్షల మంది దిశ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నారని హోంమంత్రి తెలిపారు. తాడేపల్లి ఘటన తర్వాత దిశ చట్టం, దిశ యాప్‌పై స్పెషల్ డ్రైవ్ ద్వారా అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు వెల్లడించారు. దిశ యాప్ మహిళలు అందరూ డౌన్‌లోడ్ చేసుకోవాలన్న సుచరిత ఆపదలో ఉన్న మహిళలకు యాప్ తప్పకుండా రక్షణ కల్పిస్తుందని స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story