Srisailam Temple: శ్రీశైలంలో దసరా మహోత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు

Srisailam Temple: ఈనెల 26 నుంచి సెప్టెంబర్ 5 వరకు దసరా ఉత్సవాలు

Jyothi
Published on: 22 Sept 2022 10:14 AM IST
Special Arrangements for Dussehra Celebrations in Srisailam Temple
X

Srisailam Temple: శ్రీశైలంలో దసరా మహోత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు

Srisailam Temple: శ్రీశైల మహాక్షేత్రంలో ఈనెల 26 నుంచి సెప్టెంబర్ 5 వరకు దసరా మహోత్సవాలు నిర్వహించినట్లు ఈవో లవన్న తెలిపారు. దసరా ఉత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహించనున్నామని చెప్పారు. స్వామి అమ్మవార్లకు విశేష అర్చనలు, రుద్రయాగం, చండీయాగం, జప పారాయణాలు, అమ్మవారి ఉత్సవమూర్తికి నవదుర్గ అలంకరణాలు, స్వామి అమ్మవార్లకు వివిధ వాహన సేవలు నిర్వహిస్తామని ఈవో లవన్న తెలిపారు. ఈనెల 26న ఉదయం 8గంటల 30 నిమిషాలకు యాగశాల ప్రవేశంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని చెప్పారు. ఆస్విజ శుద్ధ దశమి రోజున శ్రీ భ్రమరాంబ దేవికి నిజరూప అలంకరణ, స్వామి వారికి నంది వాహన సేవతో ఉత్సవాలు ముగియనున్నట్లు ఈవో లవన్న తెలిపారు.

Jyothi

Jyothi

Next Story