ఏపీ స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు తప్పిన ప్రమాదం

Arun Chilukuri
Published on: 21 Nov 2020 3:51 PM IST
ఏపీ స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు తప్పిన ప్రమాదం
X

ఏపీ స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు తృటిలో ప్రమాదం తప్పింది. స్పీకర్‌ తమ్మినేని ప్రయాణిస్తున్న కారును ఆటో ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో స్పీకర్‌ కారు పొలాల్లోకి దూసుకెళ్లింది. స్పీకర్‌ తమ్మినేని సీతారాం సురక్షితంగా బయటపడ్డారు. ఆటో డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. శనివారం మధ్నాహం శ్రీకాకుళం కలెక్టరేట్‌ నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో క్షేమంగా తిరిగి వెళ్లారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story