S.Rayavaram: లాక్ డౌన్ మరింత పటిష్టంగా అమలు చేయాలి: ఏఎస్పీ రిశాంత్ రెడ్డి

జిల్లాలో కరోనా వ్యాప్తి శరవేగంగా పుంజుకుంటున్న నేపథ్యంలో లాక్ డౌన్ మరింత పటిష్టంగా అమలు చేయాలని నర్సీపట్నం ఏఎస్పి రిశాంత్ రెడ్డి సూచించారు.

S. Srikanth
Published on: 26 April 2020 11:06 AM IST
S.Rayavaram: లాక్ డౌన్ మరింత పటిష్టంగా అమలు చేయాలి: ఏఎస్పీ రిశాంత్ రెడ్డి
X

ఎస్.రాయవరం: జిల్లాలో కరోనా వ్యాప్తి శరవేగంగా పుంజుకుంటున్న నేపథ్యంలో లాక్ డౌన్ మరింత పటిష్టంగా అమలు చేయాలని నర్సీపట్నం ఏఎస్పి రిశాంత్ రెడ్డి సూచించారు. ఆదివారం ఉదయం అడ్డురోడ్డు లోని మార్కెట్ ను పరిశీలించిన ఆయన వినియోగదారులు సామాజిక దూరం పాటించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... కరోనా వ్యాప్తి రోజు, రోజుకి పెరుగుతున్నందున మరింత జాగ్రత్త అవసరం అన్నారు.

ఉదయం తొమ్మిది గంటల తర్వాత కారణం లేకుండా బయట తిరిగే వారు ఎవరైనా కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం నాలుగో దశ నడుస్తున్నందున కరోనా వ్యాప్తి జోరందుకుంది అని వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు సామూహిక భద్రత అవసరమని ఆయన సూచించారు. గుంపులుగా ఉండే సమూహాల పట్ల చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈయన వెంట ఎస్.రాయవరం ఎస్సై ధనుంజయ్ ఉన్నారు.

S. Srikanth

S. Srikanth

Next Story