Anantapur: బుల్లెట్టు బండి పాటకు అదిరిపోయే డ్యాన్స్ చేసిన జిల్లా ఎస్పీ

వనభోజనాలకు హాజరైన జిల్లా ఎస్పీ ఫకీరప్ప చిన్న పిల్లలతో కలిసి బుల్లెట్‌ సాంగ్‌కు స్టెప్పులేశారు

Arun Chilukuri
Published on: 3 Dec 2021 3:32 PM IST
District SP Pakirappa was Attending The Picnic, Stepped into The Bullet Bandi Song with The Young Children.
X

వనభోజనాల్లో పాల్గొని చిన్న పిల్లలతో కలిసి డ్యాన్స్ వేసిన ఎస్పీ(ఫైల్-ఫోటో)

Anantapur: అనంతపురం జిల్లా కంబదురు మండల కేంద్రంలో కార్తీక వనభోజనాల కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ డ్యాన్సులు వేయడం ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ అయింది. కళ్యాణదుర్గం డివిజన్‌ పరిధిలోని పోలీసులు, వారి కుటుంబ సభ్యులు అండేపల్లి రామప్ప దేవాలయం ప్రాంగణంలో వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఈ వనభోజనాలకు హాజరైన జిల్లా ఎస్పీ ఫకీరప్ప చిన్న పిల్లలతో కలిసి బుల్లెట్‌ బండి సాంగ్‌కు స్టెప్పులేశారు. దీంతో సోషల్‌ మీడియాలో వీడియో చక్కర్లు కొడుతోంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story