Southwest Monsoon: చల్లని కబురు.. రెండు రోజుల్లో దేశమంతా నైరుతి విస్తరణ

Southwest Monsoon: దేశం మొత్తంలో నైరుతి రుతుపవనాలు మరో రెండు, మూడు రోజుల్లో పూర్తిగా విస్తరించనున్నట్లు భారత వాతావరణశాఖ ప్రకటించింది.

Arun Chilukuri
Published on: 24 Jun 2025 10:58 AM IST
Southwest Monsoon
X

Southwest Monsoon: చల్లని కబురు.. రెండు రోజుల్లో దేశమంతా నైరుతి విస్తరణ

Southwest Monsoon: దేశం మొత్తంలో నైరుతి రుతుపవనాలు మరో రెండు, మూడు రోజుల్లో పూర్తిగా విస్తరించనున్నట్లు భారత వాతావరణశాఖ ప్రకటించింది. ఇప్పటికే పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని అధికారులు తెలిపారు.

దీనివల్ల ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. శుక్రవారం నాటికి ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని హెచ్చరించింది.

సముద్రం అలజడి గా మారనున్న నేపథ్యంలో మత్స్యకారులు మంగళవారం వేటకు వెళ్లకుండా జాగ్రత్త పాటించాలంటూ వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. తీర ప్రాంత ప్రజలు అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story