Kadapa: దారుణం.. అక్కను చంపిందని తల్లిని హతమార్చిన కుమారుడు

Kadapa: కడప నగరంలోని నకాశ్‌వీధిలో దారుణం జరిగింది.

Arun Chilukuri
Published on: 21 Oct 2021 7:16 PM IST
son Killed his Mother for Killing his Sister in Kadapa
X

Kadapa: దారుణం.. అక్కను చంపిందని తల్లిని హతమార్చిన కుమారుడు

Kadapa: కడప నగరంలోని నకాశ్‌వీధిలో దారుణం జరిగింది. అక్కను చంపిందని కుమారుడు తన తల్లిని హతమార్చాడు. నకాశ్‌వీధికి చెందిన షేక్‌ హుస్సేన్, ఖుర్షీదా దంపతులకు ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. భార్యభర్తల మధ్య గొడవలు రావడంతో ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. తల్లితోనే ఉంటున్న కూతురు అలీమా తరుచూ సెల్‌ఫోన్‌ చూస్తుండడంతో తల్లి ఖుర్షీదా మందలించింది. దీంతో తల్లి కూతుళ్ల మధ్య బుధవారం రాత్రి వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన ఖుర్షీదా చున్నీతో అలీమా మెడకు బిగించి చంపేసింది. అక్కడే ఉన్న కుమారుడు జమీర్‌ అక్కనే చంపేస్తావా అంటూ తల్లిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story