ఏపీలో పార్టీ బలోపేతానికి బీజేపీ వ్యూహాలు

X
Highlights
ఏపీలో పార్టీ బలోపేతానికి బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులను బీజేపీలోకి ఆహ్వానిం...
Arun Chilukuri15 Jan 2021 9:59 AM GMT
ఏపీలో పార్టీ బలోపేతానికి బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులను బీజేపీలోకి ఆహ్వానించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇటీవలే నటి వాణీవిశ్వనాథ్‌ను కలిసి చర్చించారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు. కిర్లంపూడిలో రేపు ముద్రగడతో సోమువీర్రాజుతో భేటీకానున్నారు. కళా వెంకట్రావు, పడాల అరుణతో భేటీ అయ్యే ఛాన్స్ ఉంది. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జనసేన మద్దతు సంపాదించిన బీజేపీ ఇప్పుడు కాపు వోట్ బ్యాంక్ ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎలా అయినా ముద్రగడను పార్టీలో చేర్చుకునే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి మరి రేపటి భేటీ ఎన్ని కొత్త రాజకీయ సమీకరణాలకు కారణం అవుతుందో ?
Web TitleSomu Veerraju to meet Mudragada Padmanabham
Next Story