Somu Veerraju: కోర్టు నుంచి తప్పించుకోడానికే జగన్ ఎత్తుగడలు

Somu Veerraju: అభివృద్ధి వికేంద్రీకరణపై మాట్లాడే హక్కు జగన్ కు లేదు : వీర్రాజు

Sandeep Eggoju
Published on: 22 Nov 2021 6:35 PM IST
Somu Veerraju Reacts on Three Capitals Bill Withdraw
X

కోర్టు నుంచి తప్పించుకోడానికే జగన్ ఎత్తుగడలు (ఫైల్ ఇమేజ్)

Somu Veerraju: మూడు రాజధానుల విషయంలో న్యాయస్థానం నుంచి తప్పించుకోడానికి ఏపీ ప్రభుత్వం ఎత్తుగడలు వేస్తోందని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు విమర్శించారు.కోర్టులో తీర్పు వ్యతిరేకంగా వస్తుందని తెలిసి బిల్లును వెనక్కు తీసుకున్నారని, మళ్లీ పకడ్బందిగా బిల్లు తెస్తామనడం హాస్యాస్పదమని సోము వీర్రాజు అన్నారు. అమరావతి రాజధానిగా ఉండాలనే బీజేపి కోరుకుంటోందని అదే సమయంలో కర్నూలుకు హైకోర్ట్ కేటాయింపు పై బీజేపి కట్టుబడి ఉందని అన్నారు. అధికార వికేంద్రీకరణతోనే అభిృవృద్ధి సాధ్యమని,సీమ అభివృద్ధికి ఇప్పటి వరకూ ఏమీ చేయని జగన్ కు వికేంద్రీకరణపై మాట్లాడే హక్కే లేదన్నారు సోము వీర్రాజు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story