ఏపీలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ షురూ.. ఓ సెలబ్రిటీని..

Arun Chilukuri
Updated on: 9 Jan 2021 10:00 PM IST
ఏపీలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ షురూ.. ఓ సెలబ్రిటీని..
X

ఆపరేషన్‌ ఆకర్ష్‌లో వేగం పెంచింది ఏపీ బీజేపీ. తిరుపతి ఉప ఎన్నిక ముందు ఓ సెలబ్రిటీని పార్టీలోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఇవాళ నటి వాణి వి‌శ్వనాథ్‌ను కలిశారు. చెన్నైకి వెళ్లి స్వయంగా కలిసిన సోము వీర్రాజు బీజేపీలో చేరికపై చర్చించారు. వాణి విశ్వనాథ్ కూడా బీజేపీలో చేరడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వాణివిశ్వనాథ్ 40కి పైగా తెలుగు సినిమాల్లో నటించారు. ఆమె 'ఘరానామొగుడు' సినిమాలో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అంతేకాదు మరో నటి ప్రియారామన్‌ను కూడా సోమువీర్రాజు బీజేపీలోకి ఆహ్వానించారు. ఆమె కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story