Somu Veerraju: హస్తినకు ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు

Somu Veerraju: ఢిల్లీలో 5రోజుల పాటు పర్యటించనున్న సోము * రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్రమంత్రులతో భేటీ

Sandeep Eggoju
Updated on: 3 Aug 2021 1:53 PM IST
Somu Veerraju Going to be Visit Delhi
X
5 రోజులపాటు ఢిల్లీలో పర్యటించనున్న సోము వీర్రాజు (ఫైల్ ఇమేజ్)

Somu Veerraju: ఢిల్లీలో 5రోజుల పాటు పర్యటించనున్నారు ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు. పార్టీ అంతర్గత సమావేశాలతో పాటు ఏపీకి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్ర షెకావత్‌తో భేటీ అయి.. పోలవరం ప్రాజెక్టు, R&R ప్యాకేజీ, ప్రాజెక్టుకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై చర్చించనున్నారు. అలాగే.. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలసి ఏపీ ఆర్ధిక పరిస్థితులపై ఫిర్యాదు చేయనున్నారు.

ఇక కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌ను కలిసి, ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను, ఎగుమతులు అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నారు. రైల్వే శాఖామంత్రి అశ్వని వైష్ణవ్‌తో భేటీ అయి.. రాష్ట్రంలో రైల్వే పెండింగ్ ప్రాజెక్టులు అంశాలు, విశాఖ రైల్వే జోన్ అభివృద్ధిపై చర్చ జరపనున్నారు సోము వీర్రాజు. ఇక.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి, రాష్ట్రంలో బీజేపీ కార్యక్రమాలు, పార్టీ విస్తరణ, బలోపేతానికి తీసుకుంటున్న చర్యలపై నివేదించనున్నారు సోము వీర్రాజు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story