అచ్చెన్నాయుడి అరెస్టును ఖండించిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

అచ్చెన్నాయుడి అరెస్టును ఖండించిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
x

అచ్చెన్నాయుడి అరెస్టును ఖండించిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

Highlights

*సీఎం జగన్ అరాచకాలు, దుర్మార్గాలకు పరాకాష్ట అంటూ విమర్శలు *ఏకగ్రీవాలకు పిలుపునిస్తూనే.. ఏకగ్రీవాలకు ప్రయత్నించిన వారిపై కేసులు : సోమిరెడ్డి

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడి అరెస్టును మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. సీఎం జగన్ అరాచకాలు, దుర్మార్గాలకు ఇది పరాకాష్ట అంటూ విమర్శించారు. ప్రభుత్వం ఓవైపు ఏకగ్రీవాలకు పిలుపునిస్తూనే.. ఏకగ్రీవాలకు ప్రయత్నించిన అచ్చెన్నాయుడితో పాటు ఆయన కుటుంబసభ్యులు, అనుచరులను అరెస్ట్ చేయడం ఎంటని ప్రశ్నించారు. జగన్‌పై సీబీఐ దర్యాప్తునకు అచ్చెన్నాయుడు కేసు పెట్టినందుకే ఆ కుటుంబంపై కక్ష పెంచుకొని అరెస్ట్ చేసినట్లు సోమిరెడ్డి ఆరోపించారు. అచ్చెన్నాయుడిపై వెంటనే కేసులు ఎత్తివేసి, ఆ కుటుంబానికి క్షమాపణ చెప్పాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories