Telugu Academy: తెలుగు అకాడమీ స్కాంలో కొత్త కోణం

Telugu Academy: ఏపీలోని రెండు సంస్థల నుంచి రూ.15 కోట్లు కొట్టేసిన సాయికుమార్ ముఠా

Sandeep Eggoju
Updated on: 13 Oct 2021 7:48 AM IST
Societies Fixed Deposits Scam by Saikumar and Team in Telugu Academy
X

తెలుగు అకాడమీ స్కాములో కొత్త కోణం (ఫైల్ ఇమేజ్)

Telugu Academy: తెలుగు అకాడమీ స్కాంలో కొత్త కోణం బయటపడింది. ఈ స్కాంలో తవ్విన కొద్దీ కొత్త కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. సాయికుమార్ ముఠా ఏపీలోని రెండు సంస్థల నుంచి 15 కోట్ల రూపాయలు కొట్టేసింది సీసీఎస్ పోలీసులు గుర్తించారు. ఏపీ హౌసింగ్ కార్పొరేషన్‌లో 10 కోట్లను కాజేశారు. ఏపీ సీట్స్ కార్పొరేషన్ నుంచి మరో ఐదు కోట్లు డ్రా చేశారు. ఐఓబీ బ్యాంక్ నుంచి డిపాజిట్లు బదిలీ చేశారు. ఐఓబీ నుంచి ఏపీ మర్కంటైల్ కో-ఆపరేటివ్ సొసైటీ ద్వారా నిధులను బదిలీ చేసుకుని ఆ తర్వాత విత్‌డ్రా చేశారు. ఫిక్స్‌డ్ డిపాజిట్లను కాజేసినట్లుగా సీసీఎస్ పోలీసులు గుర్తించారు. ఏపీ ప్రభుత్వానికి సీసీఎస్ పోలీసులు సమాచారం అందిచారు. సాయికుమార్ ముఠాపై మరో రెండు కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేశారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story