గాజువాక వైసీపీలో సోషల్ మీడియా రచ్చ

X
Highlights
సోషల్‌మీడియా వేదికగా విశాఖలో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేల మధ్య చిచ్చురేగింది. ఈ వివాదానికి ఇళ్ల పట్టాల పంపిణీ...
Arun Chilukuri4 Jan 2021 1:38 PM GMT
సోషల్‌మీడియా వేదికగా విశాఖలో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేల మధ్య చిచ్చురేగింది. ఈ వివాదానికి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వేదికయ్యింది. ఎమ్మెల్యే భాగ్యలక్ష్మీ ఎదుట గాజువాక ఎమ్మెల్యేను కించపరుస్తూ జెడ్పీటీసీ అభ్యర్థి నూకరాజు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు పోలీసులు ఊతమిస్తే గాని లేవని స్థితిలో ఉన్న గాజువాక ఎమ్మెల్యే ప్రజలకేం సేవచేస్తారంటూ వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా ఎమ్మెల్యే భాగ్యలక్ష్మీ సమస్యలు పరిష్కరిస్తున్నారని చెప్పుకొచ్చారు. అయితే నూకరాజు వ్యాఖ్యలను ఖండించని ఎమ్మెల్యే వేదికపై నవ్వడం తీవ్ర దుమారం రేపుతోంది. భాగల్యక్ష్మీ తీరుపై ఆగ్రహంతో ఉన్న గాజువాక వైసీపీ కార్యకర్తలు సోషల్‌మీడియా వేదికగా ఎమ్మెల్యే భాగ్యలక్ష్మీ RIP అంటూ పోస్ట్ చేశారు. దీంతో ఈ వివాదం చినికిచినికి గాలివానలా తయారయ్యింది.
Web Titlesocial media war between two YCP MLAs
Next Story