పాముపై నుంచి పోయిన ఆటో.. ఆటో డ్రైవర్ ఇంటికి వచ్చిన పాము

పాముపై నుంచి పోయిన ఆటో.. ఆటో డ్రైవర్ ఇంటికి వచ్చిన పాము
x
నాగుపాము
Highlights

నాగుపాము పగబట్టింది. మీరు వింటున్నది నిజమే పగబట్టిన ఆ పాము తనను తొక్కిన ఆటో వాలపై పగబట్టింది. ఏకంగా అతడి ఇంటికి వెళ్లింది. బయట కనిపించిన అతడ్ని...

నాగుపాము పగబట్టింది. మీరు వింటున్నది నిజమే పగబట్టిన ఆ పాము తనను తొక్కిన ఆటో వాలపై పగబట్టింది. ఏకంగా అతడి ఇంటికి వెళ్లింది. బయట కనిపించిన అతడ్ని వెంబడించి కాటేసే ప్రయత్నం చేసింది. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది.

సైదాపురం మండలం తిప్పిరెడ్డిపల్లె నుంచి మొలకలపూండ్ల గ్రామానికి ఆటో డ్రైవర్ పుల్లయ్య వస్తున్నాడు. దారి మధ్యలో పాముపై నుంచి ఆటో పోయింది. పాముకు గాయమైందని స్థానికులు కేకలు వేస్తుండగా వినిపించుకోకుండా పుల్లయ్య వెళ్లిపోయాడు. తెల్లవారుజామున పుల్లయ్య ఇంటి వద్దకు పాము వచ్చింది. బయటకు వెళుతున్న పుల్లయ్యను వెంబడించి కాటేసే ప్రయత్న చేసింది. స్థానికుల అలజడితో సమీపంలోని ట్రాన్స్ ఫారం ఎర్తింగ్ పైపులోకి పాము దూరింది.

పైపులోకి పాము వెళుతుండగా కొందరు చూశారు. పుల్లయ్య అని పిలువగా పైపులో నుంచి బయటకు వస్తోంది. పుల్లయ్య కనిపించేసరికి తిరిగి పైపులోకి వెళ్లిపోతుంది. పాము తీరుపై స్థానికులు ఆశ్యర్యం చెందారు. ఇది పగబట్టిన పాము అని, పుల్లయ్యను తప్పక కాటేసి చంపుతుందని భయపడ్డారు. పైపుల్లో దాక్కున్న పామును కొందరు కర్రలతో కొట్టి చంపే ప్రయత్నం చేశారు. ఎంతకీ పాము బయటకు రాకపోవడంతో పైపులో పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. పాము తప్పించుకోకుండా పైపు మధ్యలో కర్ర ఉంచారు. మంటల తాకిడికి పైపులో పాము మృతి చెందింది. పైపులో నుంచి చనిపోయిన పామును బయటకు తీశారు. ఎట్టకేలకు పగబట్టిన పాము చావడంతో స్థానికులు ఊపిరీ పీల్చుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories