Smuggling Alcohol in Ap: ఇలా చేస్తే ఎనిమిదేళ్ల వరకు శిక్ష తప్పదు!

Smuggling Alcohol in Ap: ఇలా చేస్తే ఎనిమిదేళ్ల వరకు శిక్ష తప్పదు!
x
Smuggling Alcohol in AP
Highlights

Smuggling Alcohol in Ap: మద్య నిషేదం అమల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం షాపులను ఏటా కుదిస్తూ వస్తోంది.

Smuggling Alcohol in Ap: మద్య నిషేదం అమల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం షాపులను ఏటా కుదిస్తూ వస్తోంది. దీంతో పాటు 200 శాతం వరకు ధరలు పెంచింది. ఇలా ఎందుకంటే పేదవాడు వైన్ షాపునకు వెళ్లాలంటే భయపడాలని. ఇంతచేసినా ఎక్కడో తేడా కొట్టినట్టు కనిపిస్తోంది. చుట్టు పక్కల రాష్ట్రాల్లో మద్యం ధరలు తక్కువగా ఉండటంతో అక్కడ నుంచి నేరుగా తెచ్చుకుని కొంతమంది అమ్మకాలు చేస్తున్నారు. ఒక్కసారి పట్టుబడితే మరొక సారి. ఇలా రెండు, మూడు సార్లు కేసులు నమోదు చేస్తున్నా అధికారులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం ఈ వ్యవహారంలో మరింత కఠినంగా ఉండేందుకు నిర్ణయించింది. ఒకసారి పట్టుబడితే సాధారణ కేసు నమోదు చేసేందుకు నిర్ణయించింది. ఇలా పదే పదే పట్టుబడితే ఏకంగా ఏకంగా ఎనిమిదేఃళ్ల వరకు జైలు శిక్ష విధించేలా గెజిట్ నోటిఫికేషన్ తీసుకొచ్చింది.

మద్యం అక్రమ రవాణాపై రాష్ట్ర ప్రభుత్వం చట్టాలను మరింత కఠినతరం చేసింది. ఎవరైనా మద్యం అక్రమంగా రవాణా చేస్తే కఠిన చట్టాలు అమల్లోకి వచ్చేలా ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. నాన్‌ బెయిలబుల్‌ కేసులతో పాటు పదే పదే మద్యం అక్రమంగా తరలిస్తూ పట్టుబడితే ఎనిమిదేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా చట్టాలను సవరించారు. వివరాలిలా ఉన్నాయి..

► రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన స్పెషల్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ బ్యూరోకు చట్టబద్ధత కల్పిస్తూ ఉత్తర్వులు

జారీ అయ్యాయి.

► పోలీస్‌ క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ అమలు చేస్తూనే ఎక్సైజ్‌ చట్టంలో పలు సవరణలు చేశారు.

► తాజాగా సవరించిన ఎక్సైజ్‌ చట్టం 34 (ఏ) ప్రకారం ఒకే వ్యక్తి పలుమార్లు ఎక్సైజ్‌ నేరాలకు పాల్పడితే ఐదు నుంచి ఎనిమిదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు.

► సాధారణ కేసుల విషయంలోనూ రెండేళ్లకు తగ్గకుండా శిక్షలు పడే విధంగా చట్టాన్ని పటిష్టం చేశారు.

► ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ స్థానంలో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ప్రధాన పాత్ర పోషిస్తుంది.

► ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమంగా రవాణా కాకుండా, ఏపీలో సారా రూపంలో కల్తీ మద్యం తయారు కాకుండా నిరోధించేందుకు ఎస్‌ఈబీ స్వతంత్ర వ్యవస్థగా పనిచేస్తుంది.

దశల వారీ మద్య నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్‌ వి.లక్ష్మణరెడ్డి చెప్పారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖను నిర్వీర్యం చేశారన్నారు. ఇప్పుడు పోలీసులు, ఎక్సైజ్‌ అధికారులు కలిసిఅక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపుతున్నారని, ఎస్‌ఈబీకి చట్టబద్ధత కల్పిస్తూ ప్రభుత్వం గెజిట్‌ విడుదల చేయడం హర్షణీయమన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories