Tirupati: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న స్మృతీ ఇరానీ

Tirupati: ఉదయం సుపథం ప్రత్యేక ప్రవేశ మార్గం గుండా స్వామి వారి దర్శనం

Sandeep Eggoju
Updated on: 3 March 2021 3:56 PM IST
Smriti  Irani Visits The Thirumala Srivari Temple
X

స్మ్రితి ఇరానీ (ఫైల్ ఫోటో  ది హన్స్ ఇండియా)

Tirupati: తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం సుపథం ప్రత్యేక ప్రవేశ మార్గం గుండా స్వామి వారి సేవలో కుటుంబ సమేతంగా పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసారు. దర్శన అనంతరం రంగాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.

ఆలయం వెలుపల కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ స్వామి వారిని దర్శించుకోవడం చాల సంతోషంగా ఉందని అన్నారు. కుటుంబ సమేతంగా స్వామి వారి సేవలో పాల్గొని ఆశీర్వాదం పొందడం జరిగిందన్నారు.దేశ ప్రజలు ఆయురాయోగ్యాలతో., సుఖఃసంతోషాలతో ఉండాలని కోరుకున్నానరు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story