Andhra Pradesh: సొంత నియోజకవర్గంలో బాబుకు నిరసన సెగ

Andhra Pradesh: చిత్తూరు జిల్లా శాంతిపురంలో చంద్రబాబు రోడ్‌ షో * జూ.ఎన్టీఆర్‌ను ప్రచారానికి తీసుకురావాలంటూ డిమాండ్

Sandeep Eggoju
Published on: 26 Feb 2021 4:32 PM IST
Slogans Against the Chandrababu In Chittoor district Roadshow
X

ఫైల్ ఇమేజ్

Andhra Pradesh: అసలే పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయి కాకమీద ఉన్న చంద్రబాబుకు సొంత నియోజకవర్గంలోనే కార్యకర్తల నుంచి నిరసన సెగ తగిలింది. ఒకవైపు అధికార వైసీపీ మీద ఫైర్ అవుతుంటే మరోవైపు వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో అయిన పరువు నిలబెట్టుకునేందుకు బాబు కుప్పం నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహిస్తున్నారు.

అయితే ఇవాళ శాంతిపురంలో బాబు రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షో చంద్రబాబు నిరసన సెగ తగిలింది. టీడీపీ కార్యకర్త జూనియర్ ఎన్టీఆర్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. అంతేకాదు వచ్చే మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి జూనియర్‌ను తీసుకురావాలని డిమాండ్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్‌కి జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రోడ్‌ షో సందర్భంగా ఏర్పాటు ప్లెక్సీల్లోనూ జూనియర్ ఎన్టీఆర్‌ ఫొటో పెట్టడం ఇప్పుడు చర్చనీయంశంగా మారింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story