Tirupati Laddu Controversy: తిరుమల లడ్డూ వ్యవహారంపై సిట్ దర్యాప్తు వేగవంతం

Tirupati Laddu Controversy: టీటీడీ ఈవో శ్యామలరావును కలిసి కల్తీ నెయ్యిపై వివరాల సేకరించనున్న సిట్

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 29 Sept 2024 10:31 AM IST
Sit Investigation On Tirumala Laddu Controversy
X

Tirupati Laddu Controversy: తిరుమల లడ్డూ వ్యవహారంపై సిట్ దర్యాప్తు వేగవంతం

Tirupati Laddu Controversy: తిరుమల లడ్డూ వ్యవహరంపై దర్యాప్తును సిట్ బృందం వేగవంతం చేసింది. ఇప్పటికే తిరుపతి చేరుకున్న సర్వశ్రేష్ఠ త్రిపాఠి బృందం మూడు బృందాలుగా ఏర్పడి తిరుమల, తిరుమతిలో ఏకకాలంలో దర్యాప్తు చేయనుంది. నిన్న సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తిరుపతిలోని పోలీస్ అతిథిగృహానికి చేరుకుని బృంద సభ్యులతో సమావేశమై చర్చించారు. ఈరోజు నుంచి గోపీనాథ్ జెట్టి, హర్షవర్ధన్ రాజు, వెంకటరావుల నేతృత్వంలో మూడు బృందాలు దర్యాప్తు చేయనున్నాయి.

టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలను దర్యాప్తులో పరిగణనలోకి తీసుకోనుంది సిట్ బృందం. పాలకమండలి మండలి దగ్గర నుంచి అధికారులు, సిబ్బంది పాత్ర వరకు అన్ని అంశాలను సిట్ లోతుగా దర్యాప్తు చేయనుంది. మొదట టీటీడీ ఈవో శ్యామలరావును కలిసి నెయ్యి కల్తీ వ్యవహారంపై పూర్తి పూర్తి వివరాలు తెలుసుకోనుంది సిట్.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story