Sirisha Bandla: అలా స్పేస్ లోకి తెలుగు అమ్మాయి బండ్ల శిరీష టూర్

Sirisha Bandla is Going to go to Space
x

శిరీష బండ్ల (ఫైల్ ఇమేజ్)

Highlights

Sirisha Bandla: ఈ వ్యోమనౌకలో గుంటూరు జిల్లాకు చెందిన బండ్ల శిరీషకూడా జర్నీ చేయనుంది.

Sirisha Bandla: విను‌వీ‌ధిలో తెలుగు కీర్తి పతాకం రెప‌రె‌ప‌లా‌డ‌బో‌తోంది. తెలుగు అమ్మాయి పద పద అంటూ స్పేస్‌ టూర్‌కి పయనమైంది. 'వ‌ర్జిన్‌ గెలా‌క్టిక్‌' అంత‌రిక్ష పరి‌శో‌ధన సంస్థ వీ‌ఎ‌స్‌‌ఎస్‌ యూని‌టీ-22' అనే మాన‌వ‌స‌హిత వ్యోమ‌నౌకను మరికాసేపట్లో న్యూ మెక్సికో నుంచి రోదసీలోకి పంపించనుంది. ఈ వ్యోమనౌకలో గుంటూరు జిల్లాకు చెందిన బండ్ల శిరీషకూడా జర్నీ చేయనుంది.

వర్జిన్‌ గెలాక్టిక్‌ వ్యవస్థాపకుడు రిచర్డ్‌ బ్రాస్‌నన్‌, శిరీషతోపాటు మరో నలుగురు హ్యోమగాములు ఈ స్పేస్‌ క్రాఫ్ట్‌లో వెళ్లనున్నారు. భూమి నుంచి 15 వేల మీటర్ల ఎత్తుకు వీఎంఎస్‌ ఈవ్‌ ప్రత్యేక విమానం వెళ్లనుంది. అందులోనే వ్యోమనౌక వీఎస్‌ఎస్‌ యూనిటీ-22 ఉంటుంది.

ఏపీలోని గుంటూరు జిల్లాలో జన్మించిన బండ్ల శిరీష.. తల్లిదండ్రులతో హ్యూస్టన్‌లో స్థిరపడ్డారు. అక్కడే విద్యనభ్యసించి ఏరోనాటికల్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. కాగా, ఈ ప్రయాణంలో భాగస్వామ్యం కావడం తనకెంతో హ్యాపీగా ఉందని శిరీష ట్విటర్‌లో పోస్ట్ చేశారు. కల్పన చావ్లా, సునీత విలియమ్స్‌ తర్వాత రోదసిలోకి ప్రయాణించనున్న మూడో భారతీయ మహిళగా శిరీష చరిత్ర సృష్టించనున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories