సిమ్‌ కార్డుల ఏజెన్సీలు కాసుల కోసం సామాన్యుల డేటా చోరీ

Sim Card Agencies Steal Common Mans Data For Money
x

సిమ్‌ కార్డుల ఏజెన్సీలు కాసుల కోసం సామాన్యుల డేటా చోరీ

Highlights

Vijayawada: కానీ ఇప్పుడు మార్కెట్లోకి చాలా టెలికం కంపెనీలు రావడంతో

Vijayawada: సిమ్‌ కార్డుల ఏజెన్సీలు కాసులు కోసం సామన్యుల డేటాను సర్వీస్‌ ప్రోవైడైర్లు చోరీ చేస్తున్నాయి. విజయవాడలో సర్వీస్‌ ప్రోవైడైర్ల నుంచి వచ్చే కమిషన్ల కోసం ఆశపడ్డ కొందరు అక్రమార్కులు మనకే తెలియకుండా మన పేరుతో పదుల సంఖ్యలో సిమ్‌ కార్డులను యాక్టివేట్‌ చేస్తున్నారు. ఒకప్పుడు మనం సెల్‌ ఫోన్‌లోకి సిమ్‌ తీసుకోవాలంటే ఒక్కటే అవకాశం ఉండేది . కానీ ఇప్పుడు మార్కెట్లోకి చాలా టెలికం కంపెనీలు రావడంతో ఒక పేరుతోనే 9 సిమ్ కార్డులు వరకు తీసుకునే అవకాశం ఉండటంతో ఇప్పుడు దానిని కొందరు అక్రమార్కులు అవకాశంగా మార్చుకున్నారు . ఇలా కొత్త సిమ్ కార్డు కొనుగోలు చేయాలనీ వెళ్లిన ప్రతి ఒక్కరి ఐడీ ప్రూఫ్‌తో పదుల సంఖ్యలో సిమ్ కార్డులను యాక్టివేట్ చేసి మార్కెట్లోకి విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు ఈ కేటుగాళ్లు. యాక్టివేట‌్‌ అయిన సిమ్స్‌ మార్కెట్‌లో విక్రయించడంతో.. అవి ఎవరి చేతుల్లోకి వెళ్తున్నాయో..ఎవరు వినియోగిస్తున్నారో అనేది ఇప్పుడు అంతుచిక్కని ప్రశ్నగా మారింది.

ఈ మొత్తం మొత్తం నకిలీ సిమ్ కార్డుల వ్యవహారంలో సర్వీస్ ప్రొవైడర్లకు అనుబంధంగా ఉండే పాయింట్ ఆఫ్ సేల్స్ నుంచే మొత్తం వ్యవహరం జరిగినట్లు అటు పోలీసులు , టెలికం శాఖ అధికారులు గుర్తించారు. పాయింట్ ఆఫ్ సేల్స్ నుంచి విక్రయించిన చాలా సిమ్‌ కార్డులు యాక్టివేషన్‌లోనే ఉన్నాయి. ఒకప్పుడు సిమ్ కార్డులు తీసుకోవడం సులువు అయినా ఇటీవల సిమ్ కార్డులు తీసుకోవాలా అంటే మాత్రం కేవైసీ తప్పనిసరి చేస్తూ టెలికం శాఖ నిబంధనల కఠినతరం చేసింది. సర్వీస్‌ ప్రోవైడర్లు గత మూడేళ్లుగా కేవైసీ లేకుండా సిమ్‌ కార్డులను విక్రయించడం లేదు.. కానీ విజయవాడలో పీవోఎస్‌లు రెండు సంవత్సరాల నుంచి కేవైసీ లేకుండా యాక్టివేట‌్‌ చేస్తున్నారు. దీనిపై సర్వీస్‌ ప్రోవైడర్లను, పీవోఎస్‌ల నుంచి సరైన సమాధానం రావడంలేదు.. ఇప్పుడు ఈ సిమ్‌ కార్డులను ఎవరెవరికి వీళ్లు విక్రయించారో తెలుసుకోవడం పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది.

నకిలీ సిమ్ కార్డుల వ్యవహారంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎన్టీఆర్ జిల్లా పోలీసులు అంటున్నారు, నకిలీ సిమ్ కార్డుల వ్యవహారంలో ఇక్కడ యాక్టివేట్ చేసిన వారిని అదుపులోకి తీసుకోని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. కేవలం సిమ్ కార్డులు ఎక్కువ అమ్మకాలు జరపడం వల్లనా వచ్చే కమిషన్ కోసం కక్కుర్తిపడి కొందరు పీవోఎస్‌లు నుంచి సిమ్ కార్డులు యాక్టివేట్ చేసినట్లు విచారణలో తేలినట్లు పోలీసులు అంటున్నారు. వీటిలో చాలా వరకు యాక్టివ్ లేవని.. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న వారిని పిలిచి విచారిస్తున్నామని సిడీఆర్ పెట్టి మిగతా వారిని కూడా విచారణ చేస్తామని పోలీసులు అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories