Nellore: కానిస్టేబుల్‌తో ఎస్సై ప్రేమాయణం.. పెళ్లి చేసుకొని..

Crime News: భార్యను వేధించిన ఘటనలో ఓ ఎస్సైపై దిశ పోలీసులు కేసు నమోదు చేశారు.

Arun Chilukuri
Published on: 4 Oct 2022 1:49 PM IST
SI Cheats Woman Constable After Love Marriage in Nellore
X

Nellore: కానిస్టేబుల్‌తో ఎస్సై ప్రేమాయణం.. పెళ్లి చేసుకొని..

Crime News: భార్యను వేధించిన ఘటనలో ఓ ఎస్సైపై దిశ పోలీసులు కేసు నమోదు చేశారు. వేదాయపాళెం ఎస్సైగా షేక్‌ మహబూబ్‌ సుభాని పని చేస్తున్నారు. సంతపేట పోలీసుస్టేషన్‌లో పనిచేస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్‌ను రెండేళ్ల కిందట అదే స్టేషన్‌లో పనిచేసిన ఎస్‌ఐ మహబూబ్‌ సుభాని ప్రేమించి వివాహం చేసుకున్నారు. అయితే కొంతకాలంగా భార్యను వేధించడం ప్రారంభించాడు. అలాగే భార్యను విడిచి పెట్టివస్తే మరో వివాహం చేస్తామని ఎస్‌ఐని ఆయన తల్లి, కుటుంబ సభ్యులు ప్రోత్సహించారు. దీంతో భార్యను మరింత వేధింపులకు గురిచేయడం ప్రారంభించాడు. గర్భం తీయించాలంటూ తనను పిడిగుద్దులతో దాడి చేశాడని బాధితురాలు ఆరోపిస్తోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐపై అదనపు కట్నం వేధింపులు, హత్యాయత్నానికి పాల్పడినట్లుగా కేసు నమోదు చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story