Short Film Competition Over Alcohol: 'మద్యం మానండి బాబులూ'..ఏపీ ప్రభుత్వం సరికొత్త ప్రయత్నం!

andhra pradesh liquor campaign committee
Short Film Competition Over Alcohol: మద్యం పలు కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నది. దీని మత్తులో చిక్కుకున్న అనేక పేద కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అనేక ఆడ బిడ్డల జీవితాలు మంటగలుస్తున్నాయి.
Short Film Competition Over Alcohol: మద్యం పలు కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నది. దీని మత్తులో చిక్కుకున్న అనేక పేద కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అనేక ఆడ బిడ్డల జీవితాలు మంటగలుస్తున్నాయి. మద్యం సమాజాన్ని సమాధిగా మారుస్తుంది. ఈ ఇలాంటి అలవాటు నుంచి దూరం చేయడం కోసం.. ప్రజల్లో మార్పు తెవడం కోసం.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విన్నూత్న ఆలోచన చేసింది.
మద్యం మహమ్మరిని నియంత్రించేందుకు ఇప్పటికే పలు చర్యలు చేపట్టిన ఏపీ ప్రభుత్వం మరో విన్నూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా మద్యం వల్ల కలిగే దుష్ఫలితాలు ఎలా ఉంటాయో ప్రజలకు తెలియజేసేలా చేసేందుకు షార్ట్ ఫిల్మ్ పోటీలను నిర్వహించాలని నిర్ణయించింది.
వివరాల్లోకెళ్తే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలోని మద్య విమోచన ప్రచార కమిటీ షార్ట్ ఫిల్మ్ పోటీలను నిర్వహిస్తోంది. మద్యం దుష్ప్రభావాలు, రాష్ట్రంలో దశలవారీగా మద్య నిషేధం అమలు' అనే సబ్జెక్ట్‌పై షార్ట్ ఫిల్మ్‌లు రూపొందించాలని షార్ట్ ఫిల్మ్ రూపకర్తలకు ఆహ్వానాలు పంపింది. మొత్తం 15 ఉత్తమ చిత్రాలకు బహుమతులతో పాటు ప్రభుత్వ ప్రశంసా పత్రం అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. తాజాగా దీనికి సంబంధించిన పోస్టర్‌ను మంత్రి పేర్ని నాని ఆవిష్కరించారు.
తెలుగులో 5-10 నిమిషాల నిడివితో తీసిన షార్ట్ ఫిల్మ్‌లను సెప్టెంబర్ 25లోపు [email protected] కు పంపాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించే ఈ కాంటెస్ట్‌లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఆసక్తి గలిగిన వారు పాల్గొనవచ్చు. ఇక రిజిస్ట్రేషన్ల కోసం 9381243599, 8790005577 నెంబర్లను సంప్రదించాలని అన్నారు. కాగా, ఈ కాంటెస్ట్‌లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఆసక్తి గలిగిన వారు పాల్గొనవచ్చునని స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వం చేస్తున్న ఈ విన్నూత్న ప్రయత్నం ఎంతవరకు సత్ఫలితాలు ఇస్తుందో వేచి చూడాలి.
Niranjan Reddy: బీజేపీ టూరిస్ట్‌లు నెల రోజులకు ఓసారి వచ్చి వెళ్తున్నారు
29 Jun 2022 9:26 AM GMTమోడీ పర్యటనలో మెగాస్టార్‌కు ఆహ్వానం .. పవన్‌కు లభించని ఇన్విటేషన్
29 Jun 2022 7:54 AM GMTఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభను కనబరచిన అల్ఫోర్స్ జూనియర్ కళాశాల విద్యార్ధులు
29 Jun 2022 7:16 AM GMTHyderabad: ప్రధాని మోడీ పర్యటనకు భారీ భద్రత
29 Jun 2022 6:52 AM GMTజమున హేచరీస్ భూముల పంపిణీ
29 Jun 2022 6:49 AM GMTకోనసీమ జిల్లాలో కలెక్టర్ సుడిగాలి పర్యటన
29 Jun 2022 6:26 AM GMTVijayasai Reddy: ఒకే ఒక్క నినాదంతో ప్లీనరీ నిర్వహిస్తున్నాం
29 Jun 2022 6:15 AM GMT
మెగా హీరోలతో సినిమా ప్లాన్ చేస్తున్న సంతోష్ శ్రీనివాస్
30 Jun 2022 10:00 AM GMTవిషాదం.. ఆర్మీ బేస్ క్యాంప్‌పై విరిగిపడిన కొండ చరియలు.. ఏడుగురు...
30 Jun 2022 10:00 AM GMTPost Offices: పోస్టాఫీసులో అకౌంట్ ఉందా.. అయితే మీకు ఈ ప్రయోజనాలు...
30 Jun 2022 9:30 AM GMTకుప్పం అభ్యర్థిపై మంత్రి పెద్దిరెడ్డి క్లారిటీ
30 Jun 2022 8:54 AM GMTసీఎం కేసీఆర్ కు ఈటల జమున సవాల్.. నిరూపిస్తే ముక్కు నేలకు రాయటానికి...
30 Jun 2022 8:39 AM GMT