Yemmiganur: ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వైసీపీకి షాక్

Yemmiganur: టీడీపీలో చేరిన 200కుటుంబాలు

Shashank Gullapelli
Published on: 28 April 2024 10:06 AM IST
Shock For YCP In Yemmiganur Constituency
X

Yemmiganur: ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వైసీపీకి షాక్ 

Yemmiganur: ఎమ్మిగనూరు నియోజకవర్గంలో అధికార వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి అన్నారు నియోజకవర్గ టిడిపి అభ్యర్థి బివి జై నాగేశ్వర్ రెడ్డి. టీఎస్ కూలూరు , మసీద్ పురం గ్రామాల్లోని సుమారు 200 కుటుంబాలు వైసీపీ నీ వీడి టిడిపి కండువా కప్పుకున్నారు. టిడిపి అభ్యర్థి,మాజీ ఎమ్మెల్యే బివి జయ నాగేశ్వర్ రెడ్డి నూతనంగా చేరే వారందరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన చేస్తోందని ఆయన అన్నారు. టిడిపి పార్టీలో చేరిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే సూపర్ సిక్స్ పథకాలను కచ్చితంగా అమలు చేస్తుందని హామీ ఇచ్చారు. మరి ముఖ్యంగా ఎమ్మిగనూరులో చేనేత టెక్స్ టైల్ పార్క్ తో పాటు, ఎన్నో సంవత్సరాల నుండి తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజల కష్టాలను చూసినవాడిగా... వాటిని పరిష్కరించేందుకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు అవసరమైతే కూటమిలో భాగమైన బిజెపి ప్రభుత్వం కేంద్రంలో వుంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వ నిధులతో ఎమ్మిగనూరు పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు పడుతున్న బాధలను తీర్చి,మౌలిక వసతుల కల్పన కు అధిక ప్రాధాన్యతను ఇస్తామన్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story