Srisailam: శ్రీశైలం మహాక్షేత్రం శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సిద్ధం

Srisailam: ఫిబ్రవరి 22 నుంచి మార్చి 4 వరకు శివరాత్రి బ్రహ్మోత్సవాలు

Rama Rao
Updated on: 23 Jan 2022 12:30 PM IST
Shivaratri Brahmotsavam in Srisailam Mallikarjuna Temple | AP News Today
X

శ్రీశైలం మహాక్షేత్రం శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సిద్ధం

Srisailam: శ్రీశైలం మహాక్షేత్రం శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సిద్ధం అవుతోంది. ఫిబ్రవరి 22 నుంచి మార్చి 4 వరకు శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో ఎస్ లవన్న వెల్లడించారు. ఉత్సవాల సమయంలో ముందస్తుగా గదుల రిజర్వేషన్ చేసుకునే సదుపాయాన్ని నిలిపివేస్తున్నట్లు ఈవో తెలిపారు. అయితే కుటీర నిర్మాణ పథకం కింద వసతి గదులు నిర్మించిన దాతలకు మాత్రం గతంలో మాదిరిగా ముందస్తు రిజర్వేషన్ ఉంటుందన్నారు. శ్రీశైలంలో జరిగే బ్రహ్మోత్సవాల వేళ దాతలు వసతి పొందేందుకు ఫిబ్రవరి 10లోగా లిఖితపూర్వకంగా అందజేయాల్సి ఉంటుందని ఈవో లవన్న సూచించారు. ఆ తర్వాత వచ్చిన లేఖలను పరిగణనలోకి తీసుకోబోమని ఆయన స్పష్టం చేశారు.

Rama Rao

Rama Rao

Next Story