AP News: సీఎం జగన్‌పై దాడికేసు రిమాండ్ రిపోర్టులో సంచలన అంశాలు

AP News: జగన్‌ను హత్య చేసేందుకే పదునైన రాయితో దాడి చేశాడు

Shashank Gullapelli
Published on: 18 April 2024 7:00 PM IST
Sensational Elements In The Remand Report Of The Attack Case On CM Jagan
X

AP News:సీఎం జగన్‌పై దాడికేసు రిమాండ్ రిపోర్టులో సంచలన అంశాలు

AP News: ఏపీ సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో నిందితుడికి విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే సీఎంపై దాడి కేసు రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. జగన్‌ను హత్య చేసేందుకే పదునైన రాయితో దాడిచేసినట్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు పోలీసులు. అదునుచూసి సున్నితమైన తల భాగంలో సీఎం జగన్‌పై దాడి చేసినట్లు తెలిపారు. జగన్‌ను హత్య చేయాలనే ఉద్దేశంతోనే సిమెంట్ కాంక్రీట్ రాయిని నిందితుడు తీసుకుని వచ్చినట్లు పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో తెలిపారు.

అయితే ప్రత్యక్ష సాక్షుల సమాచారం మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజీ ద్వారా నిందితుడు కదలికలు ఉన్నట్లు నిర్ధారించినట్లు తెలిపారు. తమకు వచ్చిన సమాచారంతో అన్ని ఆధారాలు సేకరించి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ నెల 17న నిందితుడిని రాజరాజేశ్వరిపేటలో అరెస్టు చేసి సెల్‌ఫోన్ సీజ్ చేసినట్లు రిమాండ్ రిపోర్టులో స్పష్టంచేశారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story