Buddha Venkanna: టీడీపీ నేత బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు

Buddha Venkanna: టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు

Dhatripriya
Updated on: 26 Feb 2024 12:59 PM IST
Sensational Comments Of TDP Leader Buddha Venkanna
X

Buddha Venkanna: టీడీపీ నేత బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు 

Buddha Venkanna: టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల క్రితం టీడీపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంతో చాలా బాధపడ్డానన్నారు. ఈరోజు టికెట్లు ఇచ్చిన వాళ్లు పార్టీలో ఉండొచ్చు.. రేపు వెళ్లిపోవచ్చు. కానీ.. టికెట్ ఇచ్చినా.. ఇవ్వకపోయినా.. నేను చంద్రబాబు వెంటే ఉంటానని బుద్ధా వెంకన్న స్పష్టం చేశారు.

ఇప్పటివరకూ చంద్రబాబును విమర్శించిన వైసీపీ నేతలపైకి 100 కిలోమీటర్ల స్పీడ్‌తో వెళ్లానని... ఇకపై 200 కిలోమీటర్ల స్పీడ్‌తో దూసుకెళ్తానని వెంకన్న స్పష్టం చేశారు. రాముడికి హనుమంతుడిలాగా.. చంద్రబాబుకు బుద్ధా వెంకన్న ఎప్పుడూ ఉంటానన్నారు. తనను హనుమంతుడితో పోల్చారని.. తనకు అంతకుమించిన పదవి అక్కర్లేదన్నారు. చంద్రబాబుకు కష‌్టమొస్తే.. పోరాటడానికి పక్కనే ఎల్లప్పుడూ ఉంటానన్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story