Sridhar Reddy: నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Sridhar Reddy: టిడిపి కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారికి పరోక్షంగా హెచ్చరికలు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 13 Jun 2024 9:23 AM IST
Sensational comments of Nellore MLA Kotamreddy Sridhar Reddy
X

Sridhar Reddy: నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Sridhar Reddy: ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వేళ... అధికారకూటమి కార్యకర్తల్లో సంబరాల్లో మునిగిపోయారు. పలుచోట్ల బాణసంచా పేల్చి మిఠాయిలు పంచారు. కేకులు కట్ చేశారు. నెల్లూరు నగర నియోజకవర్గం టిడిపీ ఇన్చార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నగరంలో గత ఐదేళ్ల పాలనలో అధికార పార్టీ నేతల మాటలు విని తమ పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిపై ఒకటికి పదింతలు కక్ష తీర్చుకుంటామంటూ ఆయన వ్యాఖ్యానించారు. అప్పట్లో కొందరు పోలీస్ లను అడ్డుపెట్టుకొని అధికార పార్టీ వారి మాటలు విని దూకుడుగా వ్యవహరించిన పోలీసులను తాము వదిలిపెట్టబోమన్నారు. నగరంలోని నారావారి వీధిలో టిడిపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన సంబరాలు కేక్ కటింగ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో టిడిపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారికి పరోక్షంగా హెచ్చరికలు చేశారు. రెండోసారి ఏపీ క్యాబినెట్లో మంత్రిగా బాధ్యతలు తీసుకున్న డాక్టర్ పొంగూరు నారాయణ గతంలో నగరంలో ఆగిన పనులను పూర్తి చేస్తామని అభివృద్ధికి నాంది పలుకుతామని తెలిపారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story