వీడియో: ఏనుగు పిల్లే కదా.. సెల్ఫీ దిగుదామనుకున్నారు.. ఏమి జరిగిందో చూడండి..

ఒక్కోసారి ఎవరో చేసిన అల్లరి పనికి ఇంకొకరు బాలి అవుతారు. సరిగ్గా అదే జరిగింది శ్రీకాకుళం-ఒడిశా సరిహద్దుల్లో.
ఒక్కోసారి ఎవరో చేసిన అల్లరి పనికి ఇంకొకరు బాలి అవుతారు. సరిగ్గా అదే జరిగింది శ్రీకాకుళం-ఒడిశా సరిహద్దుల్లో. ఏనుగు పిల్ల ముద్దుగా ఉందని సెల్ఫీలు దిగి ఆడుకున్నారు. తల్లి తన పిల్ల కోసం వెతుకుతున్న తల్లి ఏనుగుకు ఆ దృశ్యం కనపడింది. అంతే తరువాత జరగకూడనిది నిమిషాల్లో జరిగిపోయింది.
ఏపీ ఒడిశా సరిహద్దుల్లో ఏనుగుల్ గుంపులు తరచూ హంగామా సృష్టిస్తుంటాయి.ఒక్కోసారి అక్కడి రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తాయి. అలాగే ఈ మధ్య ఓ ఏనుగుల గుంపు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం కేశుపురం, బూర్జపాడు, లక్ష్మీపురం గ్రామ పరిసరాల్లో హడావుడి చేసింది. అక్కడి నుంచి ఆ ఏనుగుల గుంపు ఒడిశా వైపు వెళ్ళింది. స్థానికంగా ఉన్న బహుదా నదిని దాటి వెళుతుండగా ఆ గుంపులో ఓ చిన్న ఏనుగు దారితప్పి చిక్కుపడిపోయింది. దీంతో అక్కడి దగ్గరలో ఉన్న యువకులు దానిని ఒడ్డుకు తీసుకు వచ్చి ఆటలాడుకోవడం మొదలు పెట్టారు. ఆ ఏనుగు పిల్లతో సెల్ఫీలు దిగారు. ఆదుకున్నారు.
ఇంతలో తప్పిపోయిన తన పిల్ల ఏనుగును వెదుక్కుంటూ తల్లి ఏనుగు అటువైపు వచ్చింది. దానికి తన పిల్ల ఏనుగుతో ఆటలాడుతున్న వారు కనిపించారు. అంతే! కోపంతో వారివైపు ఉరికింది. దెబ్బకు అందరూ అక్కడి నుంచి పరుగులంకించుకున్నారు. ఈ సంఘటన జరుగుతున్న ప్రాంతానికి కొద్దీ దూరంలో ఒక యువకుడు ఈ విషయాన్ని గమనించకుండా తన పని తాను చేసుకుంటున్నాడు. అందరూ అక్కడ నుంచి పారిపోగా.. ఈ యువకుడు ఏనుగుకు చిక్కాడు. అంతే.. ఆ పెద్ద ఏనుగు ఆ యువకుడిని ఫుట్ బాల్ ఆడేసింది. కాళ్లతో తొక్కి పారేసింది. ఈలోపు అక్కడి స్థానికులు పరుగుల పై వచ్చి ఏనుగును తరిమేశారు. తీవ్రంగా గాయపడ్డ యువకుడిని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. కానీ, అప్పటికే ఆయువకుడు ఏనుగు కోపానికి బలైపోయాడు.
నిడదవోలు వైసీపీ ప్లీనరీ సమావేశంలో నోరుజారిన తానేటి వనిత
28 Jun 2022 7:36 AM GMTబొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు
27 Jun 2022 4:00 PM GMTబాలినేని హాట్ కామెంట్స్.. నాపై కుట్రలు జరుగుతున్నాయి.. సొంత పార్టీ నేతలే..
27 Jun 2022 1:39 PM GMTటీ హబ్-2 ప్రారంభానికి సిద్ధం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్
27 Jun 2022 1:31 PM GMTరైతుబంధు పంపిణీ రేపటి నుంచే.. మొదటిసారి అర్హులైన వారికి అలెర్ట్.. అలా చేస్తేనే..
27 Jun 2022 1:15 PM GMTజూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు
27 Jun 2022 1:00 PM GMTవ్యవసాయ బావిలో పడిన ఏనుగు.. ఐదు గంటల పాటు శ్రమించిన అటవీ అధికారులు
27 Jun 2022 12:15 PM GMT
మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్
29 Jun 2022 4:19 AM GMTWarangal: సర్కారు స్కూళ్లల్లో సవాలక్ష సమస్యలు
29 Jun 2022 3:55 AM GMTఆదిలాబాద్ జిల్లాలో విద్యార్ధులకు పాఠ్య పుస్తకాల కష్టాలు
29 Jun 2022 3:12 AM GMTమన్యాన్ని వణికిస్తున్న సీజనల్ వ్యాధులు
29 Jun 2022 2:46 AM GMTవ్యవసాయ సీజన్ మొదలైనా నైరాశ్యంలో రైతన్న
29 Jun 2022 2:08 AM GMT