Vidadala Rajini: జగన్ సంక్షేమ పథకాలు చూసి అందరూ వైసీపీకి ఆకర్షితులవుతున్నారు

Vidadala Rajini: జగన్ పాలన పెత్తందారుల కోసం కాదని, పేదవర్గాల కోసమే

Shashank Gullapelli
Published on: 15 April 2024 3:27 PM IST
Seeing Jagan Welfare Schemes Everyone Is Attracted Towards YCP
X

Vidadala Rajini: జగన్ సంక్షేమ పథకాలు చూసి అందరూ వైసీపీకి ఆకర్షితులవుతున్నారు

Vidadala Rajini: మంచి చేసే మనిషికి... మంచి చేసే ప్రభుత్వానికి ప్రజలు మద్దతు తెలుపుతుంటారని, ఏపీ సీఎం జగన్ సంక్షేమ పథకాలు చూసి అందరూ వైసీపీకి ఆకర్షితులవుతున్నారని మంత్రి విడదల రజని అన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకులు చందు సాంబశివరావు లాంటి వారు తమ పార్టీలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. ఏ పార్టీ కానీ... ఏ రాజకీయ నాయకుడు తీసుకురాని మార్పులు తన పాలనలో జగన్ తెచ్చారని కొనియాడారామె... జగన్ పాలన పెత్తందారుల కోసం కాదని, పేదవర్గాల కోసమన్నారు. భవిష్యత్తులో సంక్షేమ పథకాలు కొనసాగాలంటే... జగన్ మరోసారి అధికారంలోకి రావాలని, పేదప్రజల్లో జగన్ చెరగని ముద్ర వేయించుకున్నారని రజని అన్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story