మంత్రి సీదిరి అప్పలరాజుకు సీఎంవో నుంచి పిలుపు.. కేబినెట్ విస్తరణపై..

Seediri Appalaraju: మంత్రి సీదిరి అప్పలరాజుకు సీఎంవో నుంచి పిలుపు వచ్చింది.

Arun Chilukuri
Published on: 31 March 2023 12:42 PM IST
Seediri Appalraju Gets Call From CMO
X

మంత్రి సీదిరి అప్పలరాజుకు సీఎంవో నుంచి పిలుపు.. కేబినెట్ విస్తరణపై..

Seediri Appalaraju: మంత్రి సీదిరి అప్పలరాజుకు సీఎంవో నుంచి పిలుపు వచ్చింది. దీంతో వెంటనే కార్యక్రమాలన్నీ రద్దు చేసుకొని మంత్రి సీదిరి అప్పలరాజు విజయవాడకు బయల్దేరారు. సీఎం జగన్‌ను కలిసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజులుగా కేబినెట్ విస్తరణపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో సీఎంవో నుంచి సీదిరికి పిలుపురావడం చర్చనీయాంశంగా మారింది. సీదిరి అప్పలరాజు రెండోసారి విస్తరణ సమయంలో మంత్రి పదవి లభించింది. మోపిదేవి వెంకటరమణ శాసనమండలికి రాజీనామా చేసి రాజ్యసభకు ఎంపికయిన నేపథ్యంలో ఆయనను జగన్ మత్స్యకారుల కోటా కింద మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అయితే మరోసారి మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో ఆయనకు జగన్ నుంచి పిలుపురావడం పార్టీలో చర్చనీయాంశమైంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story