Seediri Appalaraju: సీఎం పదవి ప్రజలు ఇవ్వాలి తప్ప, ముష్టి అడిగితే వచ్చేది కాదు..

Seediri Appalaraju: పవన్‌ సీఎం కావాలంటే రాష్ట్రమంతటా పోటీ చేయాలని మంత్రి సీదిరి అప్పలరాజు సూచించారు.

Arun Chilukuri
Updated on: 17 Jun 2023 8:15 PM IST
Seediri Appalaraju Makes Sarcastic Comments on Pawan Kalyans Varahi Yatra
X

Seediri Appalaraju: సీఎం పదవి ప్రజలు ఇవ్వాలి తప్ప, ముష్టి అడిగితే వచ్చేది కాదు..

Seediri Appalaraju: పవన్‌ సీఎం కావాలంటే రాష్ట్రమంతటా పోటీ చేయాలని మంత్రి సీదిరి అప్పలరాజు సూచించారు. ముఖ్యమంత్రి పదవి ప్రజలు ఇవ్వాలి తప్ప... ముష్టి అడిగితే వచ్చేది కాదని ఎద్దేవా చేశారు. పవన్ తాను ఎమ్మెల్యేగా గెలవడానికి తిరుగుతున్నాడా...? తన పార్టీ నుంచి ఎమ్మెల్యేలను గెలిపించేందుకా అనే క్లారిటీ లేదన్నారు. ముందు మీ పార్టీ గుర్తు పోయిందనే విషయం గుర్తు పెట్టుకోండన్నారు సీదిరి అప్పలరాజు. అసలు పవన్ కళ్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాడో డిసైడ్ కావాలని చురకలంటించారు. వారాహి యాత్ర అసంబద్దమైన యాత్ర అని విమర్శించారు. చెప్పుల గురించి మాట్లాడుతున్న పవన్.. తన పార్టీ గుర్తు గురించి మాట్లాడాలన్నారు. చెప్పులు మర్చిపొతే తెచ్చుకోవచ్చు కానీ.. పార్టీ గుర్తు పోతే ఎలా? అని ప్రశ్నించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story