సీఎం జగన్ కర్నూలు పర్యటనలో భద్రతాలోపం.. అసలేం జరిగింది?

Security Lapse at Jagan Kurnool Tour
x

సీఎం జగన్ కర్నూలు పర్యటనలో భద్రతాలోపం.. అసలేం జరిగింది?

Highlights

Jagan: ఏపీ సీఎం జగన్ కర్నూలు జిల్లా పర్యటన అది... ఎటు చూసినా పోలీసులు... అడుగడుగునా తనిఖీలు.

Jagan: ఏపీ సీఎం జగన్ కర్నూలు జిల్లా పర్యటన అది... ఎటు చూసినా పోలీసులు... అడుగడుగునా తనిఖీలు... చీమ చిట్టుక్కుమన్న పరుగులు తీస్తున్న అధికారులు... సీసీ కెమెరాలతో నిఘా... మఫ్టీలో పోలీసుల డేగకన్ను... ఇంత భద్రత ఏర్పాట్లు ఉన్నా అదంతా డొల్లతనమే అయింది. ఓ మహిళ భద్రత వలయం ఛేదించి పోలీసుల వైఫల్యం చాటి చెప్పింది. నేరుగా సీఎం జగన్ వద్దకు దూసుకుపోయింది ఆయన కాళ్లపై పడింది దీంతో సీఎం జగన్‌తో పాటు పోలీసులు, ఇతర ఉన్నతాధికారులు ఉలిక్కిపడ్డారు.

అసలు ఆ మహిళ వేదిక వరకు ఎలా వచ్చింది అన్నది అధికారులకు అంతు పట్టలేదు. ఈ హఠాత్పరిణామంతో సీఎం భద్రత అధికారులు ఆందోళన చెందారు. జిల్లా ఎస్పీ వేదిక వద్ద భద్రత ఏర్పాట్లలో ఉన్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై దర్యాప్తునకు ఎస్పీ ఆదేశించినట్టు తెలిసింది. సీఎం పర్యటనలో వెలుగు చూసిన ఈ భద్రత ఏర్పాట్ల అలసత్వం నేపథ్యంలో పోలీస్ ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది డిపార్ట్ మెంట్‌లో చర్చగా మారింది.


Show Full Article
Print Article
Next Story
More Stories