Mukul Rohatgi: చంద్రబాబుకు సెక్షన్‌ 17A వర్తించదు

Section 17A Does Not Apply To Chandrababu Says Mukul Rohatgi
x

Mukul Rohatgi: చంద్రబాబుకు సెక్షన్‌ 17A వర్తించదు

Highlights

Mukul Rohatgi: అప్పటివరకు చంద్రబాబును అరెస్ట్ చేయొద్దని ఆదేశాలు

Mukul Rohatgi: చంద్రబాబు స్క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్‌ బేలా త్రివేది ధర్మాసనం ముందు సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తున్నారు. చంద్రబాబుకు సెక్షన్‌ 17A వర్తించదని ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తున్నారు. అవినీతికి, 17A సెక్షన్‌కు సంబంధం లేదని తెలిపారు. స్కిల్‌ స్కామ్‌ సమయంలో సెక్షన్‌ 17A లేదన్న రోహత్గీ.. సెక్షన్‌ 482 కింద FIR రద్దు కుదరదన్నారు. అవినీతిపరులకు 17A రక్షణ కవచం కాకూడదని తెలిపారు రోహత్గీ.

ఇక చంద్రబాబు కేసులో వచ్చిన ఆరోపణలన్నీ ప్రత్యేక కోర్టు ద్వారా విచారించదగినవే అని కోర్టుకు తెలిపారు ముకుల్‌ రోహత్గీ. అవినీతి కేసులో చంద్రబాబుకు 17A వర్తించినా..ఐపీసీ సెక్షన్లకు వర్తించదు కాబట్టి ఐపీసీ సెక్షన్లపై ప్రత్యేక కోర్టు విచారణ జరపొచ్చన్నారు. స్కిల్‌ కేసులో 371 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేశారన్న రోహత్గి.. చంద్రబాబును ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉందని తెలిపారు. ఫోరెన్సిక్‌ నివేదికలో అనేక అంశాలు ఉన్నాయని.. చంద్రబాబు పిటిషన్‌ను క్వాష్‌ చేయకూడదని కోరారు. ముకుల్ రోహత్గీ వాదనలు ముగించడంతో.. చంద్రబాబు తరపున హరీష్ సాల్వే వర్చువల్‌గా వాదనలు ప్రారంభించారు.

మరోవైపు ఏపీ ఫైబర్‌ నెట్‌ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు పిటిషన్ వేయగా.. శుక్రవారానికి విచారణను వాయిదా వేసింది. అప్పటివరకు చంద్రబాబును అరెస్ట్ చేయొద్దని సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories