మంత్రి కొడాలి వ్యాఖ్యలపై గవర్నర్‌కు ఎస్‌ఈసీ ఫిర్యాదు
మంత్రి కొడాలి వ్యాఖ్యలపై గవర్నర్ హరిచందన్‌కు ఫిర్యాదు చేశారు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ. కొడాలి నాని చేసిన వ్యాఖ్యల వీడియోలను గవర్నర్‌కు పంపించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం, అధికార యంత్రాంగంతో సంప్రదింపులు జరుపుతుంటే ఉద్దేశపూర్వకంగానే తనపై విమర్శలు చేస్తున్నారని గవర్నర్‌కు నిమ్మగడ్డ ఫిర్యాదు చేశారు. ఉద్యోగులను, ఎన్నికల కమిషన్‌ను రెచ్చగొట్టే విధంగా కొడాలి నాని వ్యాఖ్యలు ఉన్నాయని తక్షణమే నానిపై చర్యలు తీసుకోవాలని కోరారు నిమ్మగడ్డ.
Next Story




