పోలింగ్ సిబ్బందికి పీపీఈ సూట్లు అందిస్తాం: ఎస్ఈసీ నిమ్మగడ్డ

పోలింగ్ సిబ్బందికి పీపీఈ సూట్లు అందిస్తాం: ఎస్ఈసీ నిమ్మగడ్డ
x
Highlights

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయం మరింత కాకరేపుతోంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం ముందుకెళ‌్తుంది.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయం మరింత కాకరేపుతోంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం ముందుకెళ‌్తుంది. ఎన్నికల నిర్వహణకు రాష్ట్రంలోని అన్ని పార్టీలు సంప్రదింపులు జరుపుతున్నాయని, స్థానిక ఎన్నికలు జరపాలనే ఆ పార్టీలు కోరుతున్నాయని ఎస్ఈసీ నిమ్మగడ్డ వెల్లడించారు. కరోనా వ్యాక్సినేషన్ నేపథ్యంలో స్థానిక ఎన్నికలపై ఉద్యోగ సంఘాలు విముఖత వ్యక్తం చేస్తుండడంపై ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్ స్పందించారు. పోలింగ్ సిబ్బంది కరోనా బారినపడకుండా అన్ని రకాల భద్రత చర్యలు తీసుకుంటామని హామీ చేశారు.

కరోనా వ్యాక్సిన్ పంపిణీ నేపథ్యంలో పోలింగ్ సిబ్బందికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్టు వెల్లడించారు. పోలింగ్ సిబ్బందికి పీపీఈ సూట్లు, మాస్కులు అందిస్తామని వివరించారు. ఏపీ ఉద్యోగులు ఎవరికీ తీసిపోరని, ప్రకృతి విపత్తుల సమయంలోనూ ఎంతో కష్టించి పనిచేసిన ఘనత ఏపీ ఉద్యోగుల సొంతం అని నిమ్మగడ్డ కొనియాడారు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల నేపథ్యంలోనూ వారు అదే స్ఫూర్తిని ప్రదర్శించాలని పిలుపునిచ్చారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తేనే కేంద్రం నుంచి ఆర్ధిక సంఘం నిధలు అందుతాయని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా స్థానిక ఎన్నికలు చేపట్టాల్సిన అవసరం ఉందని, ఈ క్రమంలో అందరూ కలిసిరావాలని సూచించారు.

మరోవైపు ఎస్‌ఈసీ నిర్ణయంపై ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేయడాన్ని సవాల్ చేస్తూ.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. సోమవారం ఈ పిటిషన్‌ను విచారించనుంది హైకోర్టు. రాష్ర్ట ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు కరోనా ఉధృతి కొనసాగుతుంటే గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూలు జారీ చేయడాన్ని అధికారపక్షం మండిపడుతోంది. రాజకీయ దురుద్దేశ్యంతోనే నిమ్మగడ్డ ఇలాంటి వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారని ఆరోపిస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories