రేపట్నుంచి రాష్ట్రంలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ పర్యటన

X
రేపట్నుంచి రాష్ట్రంలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ పర్యటన
Highlights
*ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించనున్న నిమ్మగడ్డ *రేపు, ఎల్లుండి... అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో టూర్
Arun Chilukuri28 Jan 2021 1:30 PM GMT
ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రేపట్నుంచి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారు. రేపు, ఎల్లుండి అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో పర్యటించనున్న ఎలక్షన్ కమిషన్ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించనున్నారు. రేపు అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఎల్లుండి కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించి అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు. శుక్రవారం ఉదయం 7.40 గంటలకు ఎస్‍ఈసీ విజయవాడ నుంచి బెంగళూరుకు వెళ్లనున్నారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అనంతపురం వెళతారు. జిల్లాలో ఎన్నికల ఏర్పాట్ల వివరాలను ఆయన తెలుసుకుంటారు. తరువాత కర్నూలు జిల్లాల్లో పర్యటిస్తారు.
Web Titlesec nimmagadda ramesh tour in andhra pradesh from tomorrow
Next Story