సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌కు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ లేఖ

SEC Nimmagadda Ramesh Letter to CS Adityanath das
x

SEC Nimmagadda Ramesh and CS Adityanath das (file image)

Highlights

* కుల ధృవీకరణ పత్రాలు, ఎన్‌వోసీలపై సీఎం జగన్‌ ఫొటోను తొలగించాలని ఆదేశం * అభ్యర్థులకు తహసీల్దార్లు జారీ చేసే కుల సర్టిఫికెట్లు

ఏపీ సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌కు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ లేఖ రాశారు. కుల ధృవీకరణ పత్రాలు, ఎన్‌వోసీలపై సీఎం జగన్‌ ఫొటోను తొలగించాలని ఆయన ఆదేశించారు. అభ్యర్థులకు తహసీల్దార్లు జారీ చేసే క్యాస్ట్‌ సర్టిఫికెట్స్‌, ఎన్‌వోసీలపై సీఎం ఫొటో ఉండటం ఎన్నికల నియమావళికి విరుద్ధమని నిమ్మగడ్డ తెలిపారు. ఈ మేరకు తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేయాల్సిందిగా సీఎస్‌కు నిమ్మగడ్డ సూచించారు. కుల ధృవీకరణ పత్రాలు, ఎన్‌వోసీల జారీలో వివక్ష, జాప్యం లేకుండా చూడాలని ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories