సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌కు ఎస్ఈసీ నిమ్మగడ్డ మరో లేఖ

X
సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌కు ఎస్ఈసీ నిమ్మగడ్డ మరో లేఖ
Highlights
*రాష్ట్రంలో ఎన్నికల కోడ్ గుర్తుచేస్తూ పలు అంశాలు ప్రస్తావించిన ఎస్‌ఈసీ *గ్రామాలకు మంత్రులు వెళ్తే ఎన్నికల ప్రచారంగా పరిగణిస్తామన్న ఎస్‌ఈసీ
Arun Chilukuri30 Jan 2021 12:00 PM GMT
ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌కు ఎస్ఈసీ నిమ్మగడ్డ మరోలేఖ రాశారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ గుర్తుచేస్తూ పలు అంశాలను ప్రస్తావించారు. గ్రామాలకు మంత్రులు వెళ్తే ఎన్నికల ప్రచారంగా పరిగణిస్తామన్న ఎస్‌ఈసీ.. మంత్రులతోపాటు గ్రామాలకు అధికారులు వెళ్లరాదని సూచించారు. అదేవిధంగా ప్రచారానికి వెళ్లే మంత్రులు అధికారిక వాహనాలు వాడరాదని సూచనలు చేశారు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రచారంతో కలిపి నిర్వహించరాదన్న ఏపీ ఎస్‌ఈసీ అభ్యర్థులకు మద్దతుగా మంత్రులు ఎలాంటి అధికారాలు వాడరాదన్నారు. ప్రభుత్వ సలహాదారులు సర్కారీ వాహనాల్లో పార్టీ ఆఫీసులకు వెళ్లరాదంటూ ఆదేశాలు జారీ చేశారు.
Web TitleSEC Nimmagadda Ramesh Kumar Letter To CS Adityanath
Next Story