AP Elections: మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై ఎస్ఈసీ దూకుడు

AP Elections: రేపటి నుంచి ఎస్ఈసీ నిమ్మగడ్డ జిల్లాల పర్యటన * జిల్లాల అధికారులకు ఎన్నికలపై దిశానిర్థేశం చేయనున్న నిమ్మగడ్డ

Sandeep Eggoju
Published on: 26 Feb 2021 4:32 PM IST
SEC Nimmagadda Ramesh Districts Tour from Tomorrow
X

నిమ్మగడ్డ రమేష్

AP Elections: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికలపై ఎస్ఈసీ దూకుడు పెంచింది. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి ఎస్ఈసీ నిమ్మగడ్డ రేపటి నుంచి జిల్లాల్లో పర్యటించనున్నారు. కలెక్టర్లు, ఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష నిర్వహించనున్నారు. పర్యటనలో భాగంగా రేపు మధ్యాహ్నం తిరుపతి, కడప, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల అధికారులతో సమీక్షించనున్నారు.

అలాగే సాయంత్రం 6 గంటలకు రాజకీయ పార్టీలతో భేటీ కానున్నారు. మరోవైపు ఈనెల 28న విజయవాడలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల అధికారులతో నిమ్మగడ్డ సమీక్ష నిర్వహించనున్నారు. ఇక.. మార్చి 1న విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల అధికారులకు మున్సిపల్ ఎన్నికలపై దిశానిర్థేశం చేయనున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story