ఎస్‌ఈసీ ఆధ్వర్యంలో అఖిలపక్షం భేటీ.. ఒక్కొక్క పార్టీకి 10 నిమిషాలు కేటాయించిన ఈసీ

ఎస్‌ఈసీ ఆధ్వర్యంలో అఖిలపక్షం భేటీ.. ఒక్కొక్క పార్టీకి 10 నిమిషాలు కేటాయించిన ఈసీ
x
Highlights

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఎస్‌ఈసీ ఆధ్వర్యంలో అఖిలపక్షం భేటీ అయింది. ఒక్కొక్క పార్టీకి 10 నిమిషాల సమయాన్ని కేటాయించిన ఈసీ పార్టీల...

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఎస్‌ఈసీ ఆధ్వర్యంలో అఖిలపక్షం భేటీ అయింది. ఒక్కొక్క పార్టీకి 10 నిమిషాల సమయాన్ని కేటాయించిన ఈసీ పార్టీల అభిప్రాయాన్ని లిఖిత పూర్వకంగా స్వీకరించింది. అయితే ఆల్‌ పార్టీ మీటింగ్‌కు అధికార పార్టీ వైసీపీ గైర్హాజరు కాగా జనసేన తమ నిర్ణయాన్ని ఈ-మెయిల్ ద్వారా ఈసీకి తెలపనుంది.

ఆల్‌ పార్టీ మీటింగ్‌లో బీజేపీ తరపున పాకా సత్యనారాయణ పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఈసీని కోరినట్టు ఆయన చెప్పారు. గతంలో జరిగిన ఏకగ్రీవాలన్నీ కూడా రద్దు చేసి తాజా ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించాలని లిఖిత పూర్వకంగా ఈసీని కోరినట్టు సత్యనారాయణ వెల్లడించారు.

స్థానిక సమస్యలు పరిష్కారమవ్వాలంటే స్థానిక ఎన్నికలు తప్పనిసరి అని అన్నారు బీఎస్పీ నేత పుష్పరాజ్. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై తమ పార్టీ అభిప్రాయాన్ని లిఖిత పూర్వకంగా ఈసీకి తెలియజేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజల్లో అవగాహన కల్పించి ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాలని కోరారు.

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా తమ పార్టీ సిద్ధంగా ఉందని, వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కోరామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌తో సమావేశం అనంతరం అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికల నోటిఫికేషన్‌ ఇచ్చినప్పటి నుంచి వైసీపీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రత్యర్థులను బెదిరించి పెద్ద ఎత్తున ఏకగ్రీవాలు చేసుకున్నారని వివరించారు. బెదిరింపులకు పాల్పడి చేసుకున్న ఏకగ్రీవాలన్నీ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎస్‌ఈసీకే భద్రత లేకపోతే ఎన్నికలు ఎలా సాఫీగా జరుగుతాయని ప్రశ్నించారు. కేంద్ర పోలీసు బలగాల సమక్షంలో ఎన్నికలు నిర్వహించాలని కోరినట్టు అచ్చెన్నాయుడు చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories